Home జాతీయ national telgu barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క

barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క

1
0

SOURCE :- ONE INDIANEWS

Telangana

oi-Rajashekhar Garrepally

|

Published: Thursday, March 28, 2024, 22:45 [IST]

Google Oneindia TeluguNews


Barrelakka
:
బర్రెలక్క
అలియాస్
కర్నె
శిరీష
తెలంగాణ
అసెంబ్లీ
ఎన్నికల
సందర్భంగా

పేరు
తెలుగు
రాష్ట్రాల్లో
మారుమోగింది.
అప్పటికే
సోషల్
మీడియాలో
తనకంటూ

గుర్తింపు
తెచ్చుకున్న
బర్రెలక్క..
అసెంబ్లీ
ఎన్నికల్లో
పోటీ
చేసి
సంచలనంగా
మారారు.
తాజాగా,
బర్రెలక్క
మరోసారి
వార్తల్లో
నిలిచారు.
ఇప్పుడు
మాత్రం
తన
వివాహ
వేడుకతో
వార్తల్లోకి
వచ్చారు.

తన
సమీప
బంధువు
వెంకటేశ్‌తో
బర్రెలక్క
ఏడడుగులు
వేశారు.
నాగర్‌కర్నూల్
జిల్లా
పెద్దకొత్తపల్లి
మండల
కేంద్రం
పీఎంఆర్
గార్డెన్‌లో
వీరి
వివాహం
జరిగింది.

వేడుకకు
కుటుంబసభ్యులు,
స్నేహితులతో
పాటు
పలువురు
ప్రముఖులు
హాజరై
వధూవరులను
ఆశీర్వదించారు.
శిరీష
తన
ప్రీ
వెడ్డింగ్,
పెళ్లి
ఫొటోలను
సోషల్
మీడియాలో
పోస్టు
చేయడంతో
వైరల్‌గా
మారాయి.
దీంతో
ఆమె
ఫాలోవర్లు,
నెటిజన్లు

జంటకు
శుభాకాంక్షలు
చెబుతున్నారు.

barrelakka married her relative venkatesh in nagarkurnool

డిగ్రీ
చదివినా
ఉద్యోగం
రావడం
లేదని,
అందుకే
తన
తల్లి
ఇచ్చిన
బర్రెలు
కాస్తూ
బతుకుతున్నానంటూ
పెట్టిన
వీడియోతో
శిరీష
సోషల్
మీడియా
ద్వారా
ఫేమస్
అయిన
విషయం
తెలిసిందే.
దీంతో
ఆమె
బర్రెలక్కగా
గుర్తింపు
తెచ్చుకున్నారు.

తర్వాత
సోషల్
మీడియా
వేదికగా
నిరుద్యోగ
సమస్యపై
తన
పోస్టులు
చేస్తూ
వార్తల్లోనూ
నిలిచారు.

ఇక,
గత
ఏడాది
జరిగిన
తెలంగాణ
అసెంబ్లీ
ఎన్నికల్లో
నాగర్‌కర్నూల్
జిల్లా
కొల్లాపూర్
అసెంబ్లీ
నియోజకవర్గం
నుంచి
స్వతంత్ర
అభ్యర్థిగా
పోటీ
చేసిన
బర్రెలక్క
అందరి
దృష్టిని
ఆకర్షించారు.
దీంతో
ఆమెకు
నిరుద్యోగ
యువత
నుంచి
మద్దతు
లభించింది.
అంతేగాక,
పలువురు
ప్రముఖుల
నుంచి
కూడా
మద్దతు
లభించింది.
కొందరు
ఆమెకు
ఆర్థిక
సాయాన్ని
కూడా
అందించారు.


ఎన్నికల్లో
ఓటమి
పాలైనప్పటికీ
ఆమెకు
సోషల్
మీడియాలో
మాత్రం
పాపులారిటీ
భారీగా
పెరిగింది.
ప్రస్తుతం
బర్రెలక్కకు
ఫేస్‌బుక్‌లో
1.42
లక్షల
మంది,
యూట్యూబ్‌లో
4.83
లక్షల
మంది,
ఇన్‌స్టాగ్రాంలో
7.83
లక్షల
మంది
ఫాలోవర్లు
ఉండటం
గమనార్హం.

English summary

barrelakka married her relative venkatesh in nagarkurnool.

Story first published: Thursday, March 28, 2024, 22:45 [IST]

SOURCE :- ONE INDIA