Home జాతీయ national telgu సీఎం జగన్ వద్దకు భూమా అఖిల ప్రియ.. తరువాత ఏం జరిగిందంటే..!

సీఎం జగన్ వద్దకు భూమా అఖిల ప్రియ.. తరువాత ఏం జరిగిందంటే..!

1
0

SOURCE :- ONE INDIANEWS

Andhra Pradesh

oi-Naresh K

|

Updated: Thursday, March 28, 2024, 14:59 [IST]

Google Oneindia TeluguNews

సీఎం
జగన్
ఎన్నికల
ప్రచారంలో
ఉద్రిక్తత
పరిస్థితులు
చోటు
చేసుకున్నాయి.
రెండో
రోజు
ఎన్నికల
ప్రచారంలో
భాగంగా
బస్సు
యాత్ర
చేపట్టిన
ఆయన
నంద్యాలలో
పర్యటిస్తున్నారు.
సాయంత్రం
నంద్యాలలో
ఏర్పాటు
చేసిన
భారీ
బహిరంగ
సభలో
జగన్
ప్రసంగించనున్నారు.
అయితే
నంద్యాలలో
వైసీపీ
ఏర్పాటు
చేసిన
సభ
వద్ద
టీడీపీ
మహిళ
నేత
భూమా
అఖిల
ప్రియ
హడావిడి
చేశారు.
టీడీపీ
శ్రేణులతో
వైసీపీ
సభ
వేదిక
వద్దకు
చేరుకున్నారామె.

సీఎం
జగన్‌ను
కలిసి
వినతి
పత్రాన్ని
ఇచ్చేందుకే
తాను
ఇక్కడికి
వచ్చానని
భూమా
అఖిల
ప్రియ
తెలిపారు.
భూమా
అఖిల
ప్రియ
సీఎం
జగన్‌ను
కలిసేందుకు
ప్రయత్నించారు.
టీడీపీ
శ్రేణులు
భారీగా
తరలి
రావడంతో
అప్రమత్తమైన
పోలీసులు
భూమా
అఖిల
ప్రియతో
పాటు
టీడీపీ
శ్రేణులను
అరెస్ట్
చేసి
పోలీసులు
స్టేషన్‌కు
తరలించారు.

Former TDP minister Akhila Priya arrested during Jagan s tour


సమయంలో
భూమా
అఖిల
ప్రియ
మాట్లాడుతూ..వినతి
పత్రం
ఇవ్వడానికి
వస్తే
అరెస్ట్
చేయడం
ఏంటని
ఆమె
పోలీసుల
తీరుపై
మండిపడ్డారు.
సీఎంను
కలవడానికి
అపాయిట్‌మెంట్
కోసం
ప్రయత్నిస్తే
సీఎంఓ
స్పందించలేదని..అందుకే
నేరుగా
జగన్‌ను
కలిసి
వినతి
పత్రం
ఇవ్వడానికి
వచ్చానని
ఆమె
తెలిపారు.
రైతు
ప్రభుత్వంగా
చెప్పుకునే
వైసీపీ
సర్కార్‌కు
నంద్యాల
నియోజకవర్గంలో
సాగునీటి
కష్టాలు
కనిపించడం
లేదా
అంటూ
ఆమె
ప్రశ్నించారు.

తక్షణమే
దీనిపై
స్పందించింది
నీటిని
విడుదల
చేయాలని
ప్రభుత్వాన్ని
కోరారు.
ఇదిలా
ఉంటే
వైసీపీ
అధినేత
జగన్
ఎన్నికల
ప్రచారం
రెండో
రోజు
జోరుగా
సాగుతుంది.
ఆళ్లగడ్డ
నుంచి
రెండో
రోజు
ప్రచారాన్ని
మొదలుపెట్టిన
సీఎం
జగన్
అక్కడి
ప్రజలతో
నేరుగా
మాట్లాడారు.
సంక్షేమ
పథకాల
అమలు..
వైసీపీ
ప్రభుత్వ
పనితీరు
గురించి
ప్రజల
నుంచి
ఫీడ్
బ్యాక్
తీసుకుంటున్నారాయన.
సాయంత్రం
నంద్యాల
ప్రభుత్వ
డిగ్రీ
కాలేజ్
మైదానంలో
భారీ
బహిరంగ
సభలో
జగన్
పాల్గొననున్నారు.

English summary

Former TDP minister Akhila Priya arrested during Jagan’s tour.

SOURCE :- ONE INDIA