Home జాతీయ national telgu ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! రంగంలోకి ఆ ముగ్గురు..

ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! రంగంలోకి ఆ ముగ్గురు..

1
0

SOURCE :- ONE INDIANEWS

Andhra Pradesh

oi-Syed Ahmed

|

Published: Thursday, March 28, 2024, 15:02 [IST]

Google Oneindia TeluguNews

ఏపీలో
సార్వత్రిక
ఎన్నికలు
హోరాహోరీగా
సాగుతున్నాయి.
వీటిని
నిష్పక్షపాతంగా
నిర్వహించేందుకు
ఈసీ
కూడా
చర్యలు
తీసుకుంటోంది.
అయినా
విపక్షాల
నుంచి
ఫిర్యాదులు
వెల్లువెత్తుతూనే
ఉన్నాయి.
ముఖ్యంగా
క్షేత్రస్ధాయి
పరిస్ధితులపై
వస్తున్న
రిపోర్టులపై
చర్యలు
తీసుకోవడం
లేదని
విపక్షాలు
గగ్గోలు
పెడుతున్నాయి.

నేపథ్యంలో
ఈసీ
కీలక
నిర్ణయం
తీసుకుంది.
రాష్ట్రానికి
ముగ్గురు
ప్రత్యేక
పరిశీలకుల్ని
పంపాలని
ఈసీ
నిర్ణయించింది.

రాష్ట్రంలో
త్వరలో
జరుగనున్న
సార్వత్రిక
ఎన్నికల
నేపథ్యంలో
రాష్ట్రానికి
ముగ్గురు
ప్రత్యేక
పరిశీలకులను
భారత
ఎన్నిక
సంఘం
నియమించినట్లు
రాష్ట్ర
ప్రధాన
ఎన్నికల
అధికారి
ముఖేష్
కుమార్
మీనా
ఇవాళ
తెలిపారు.
1987
బ్యాచ్
కి
చెందిన
రిటైర్డు
ఐఏఎస్
రామ్
మోహన్
మిశ్రాను
ప్రత్యేక
సాధారణ
పరిశీలకుడిగానూ,
1984
బ్యాచ్
కి
చెందిన
రిటైర్డు
ఐపీఎస్
దీపక్
మిశ్రాను
ప్రత్యేక
పోలీసు
పరిశీలకుడిగానూ,
1983
బ్యాక్
కి
చెందిన
రిటైర్డు
ఐఆర్ఎస్
అధికారిణి
నీనా
నిగమ్
ను
ప్రత్యేక
వ్యయ
పరిశీలకురాలిగా
నియమించినట్లు
తెలిపారు.

election commission appoint three observers to ap amid complaints from opposition nda


మేరకు
రాష్ట్ర
ఎన్నికల
ప్రధానాధికారి
కార్యాలయానికి
ఈసీ
నుంచి
సమాచారం
అందింది.

ముగ్గురు
ప్రత్యేక
పరిశీలకులు
ఇవాళ
ఢిల్లీలోని
కేంద్ర
ఎన్నికల
సంఘం
కార్యాలయంలో
జరిగే
భేటీకి
హాజరవుతున్నారన్నారు.

ముగ్గురు
రాష్ట్ర
పత్యేక
పరిశీలకులు
వచ్చే
వారం
నుండి
రాష్ట్రంలో
పర్యటించనున్నారు.
ఎన్నికల
నిర్వహణకు
రాష్ట్రంలో
చేస్తున్న
ముందస్తు
ఏర్పాట్లను
వీరు
పరిశీలిస్తారు.
అలాగే
ఎన్నికల
నిర్వహణలో
ఈసీ
మార్గదర్శకాలను
పటిష్టంగా
అమలు
పరుస్తారు.

రాష్ట్ర
సరిహద్దు
ప్రాంతాలు,
సమస్యాత్మకమైన
ప్రాంతాలతో
పాటు
ఓటర్లను
ఆకర్షించే,
ప్రేరేపించే
తాయిలాల
నియంత్రణపై
కూడా

పరిశీలకులు
ప్రత్యేక
దృష్టి
పెట్టనున్నారు.
అలాగే
జిల్లా
ఎన్నికల
అధికారులు,
ఎస్పీలు,
లా
ఎన్ఫోర్సుమెంట్
ఏజన్సీలతో
ఎన్నికల
సంఘం
నిర్వహించే
సమావేశాల్లో
వీరు
పాల్గొని,
వారి
అనుభవాలను,
సూచలను,
సలహాలను
ఇస్తారని
సీఈవో
ముకేష్
కుమార్
మీనా
తెలిపారు.

English summary

the election commission has appointed three special observers for andhra pradesh elections amid opposition complaints.

Story first published: Thursday, March 28, 2024, 15:02 [IST]

SOURCE :- ONE INDIA