Home వినోదం entertainment telgu చంద్రబాబుతో చిరంజీవి భేటీ.. సినిమా చూపించబోతున్నారా?

చంద్రబాబుతో చిరంజీవి భేటీ.. సినిమా చూపించబోతున్నారా?

2
0

SOURCE :- TELUGU ONE

ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ, ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పేరు మారుమోగిపోతోంది. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు కొద్దిరోజులుగా ఆయనను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరపున చిరంజీవి ప్రచారం చేయనున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది.

మే 10న రాత్రి విజయవాడకు వెళ్లనున్న చిరంజీవి.. మరుసటి రోజు అనగా మే 11న ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)తో సమావేశమయ్యే అవకాశముందని తెలుస్తోంది. బాబుతో కలిసి చిరు ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే, అదేరోజు చిరంజీవి విజయవాడలో ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2) సినిమా చూస్తారని సమాచారం. నారా రోహిత్ హీరోగా నటించిన ఈ పొలిటికల్ మూవీ టీజర్ ను చిరంజీవే లాంచ్ చేయడం విశేషం. 

ఇక మే 11న చిరంజీవి పిఠాపురం కూడా వెళ్లే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. తన సోదరుడు పవన్ కళ్యాణ్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మొత్తానికి మే 13న పోలింగ్ కాగా, ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన మే 11న చిరంజీవి రంగంలోకి దిగుతుండటం హాట్ టాపిక్ గా మారింది.

SOURCE : TELUGU ONE