Home జాతీయ national telgu కవితను అందుకే అరెస్ట్ చేశారు: మోడీ, రేవంత్ సర్కారుపై కేసీఆర్ తీవ్ర విమర్శలు

కవితను అందుకే అరెస్ట్ చేశారు: మోడీ, రేవంత్ సర్కారుపై కేసీఆర్ తీవ్ర విమర్శలు

1
0

SOURCE :- ONE INDIANEWS

Telangana

oi-Rajashekhar Garrepally

|

Published: Monday, May 6, 2024, 23:03 [IST]

Google Oneindia TeluguNews


నిజామాబాద్
:
కేంద్రంలోని
బీజేపీ,
రాష్ట్రంలోని
కాంగ్రెస్
ప్రభుత్వాలపై
విమర్శలు
ఎక్కుపెట్టారు
బీఆర్ఎస్
అధినేత,
మాజీ
సీఎం
కేసీఆర్.
బీఆర్ఎస్
లోక్‌సభ
ఎన్నికల
ప్రచారంలో
భాగంగా
సోమవారం
నిజామాబాద్‌లో
బస్సు
యాత్ర
నిర్వహించారు.
ఇందూరు
బీఆర్ఎస్‌
ఎంపీ
అభ్యర్థి
బాజిరెడ్డి
గోవర్ధన్‌రెడ్డిని
గెలిపించాలని
ప్రజలను
కోరారు.

కేంద్రంలోని
మోడీ
పాలన
వల్ల
తెలంగాణకు
ఏమైనా
మేలు
జరిగిందా?
అని
కేసీఆర్‌
ప్రశ్నించారు.

పదేళ్ల
కాలంలో
మోడీ
150
నినాదాలు
చెప్పారని,
మోడీ
ఇచ్చిన
నినాదాల్లో
ఒక్కటైనా
నిజమైందా?
అని
నిలదీశారు.
సబ్‌
కా
సాత్‌,
సబ్‌
కా
వికాస్‌
అని
మోడీ
అంటే..
దేశం
సత్యనాశ్‌
అయ్యిందని
ఆరోపించారు.
మోడీ
అచ్చే
దిన్‌
అంటే,
రైతులు
చచ్చేదిన్‌
వచ్చిందని
విమర్శించారు.

kcr slams bjp for kavitha arrest issue in nizamabad election campaign

దేశంలో
రైతుల
ఆదాయం
రెట్టింపు
కాకపోగా,
సాగు
ఖర్చులు
రెట్టింపు
అయ్యాయని
కేసీఆర్
ఆరోపించారు.
నిజామాబాద్
ఎంపీ
అరవింద్
గురించి
అందరికి
తెలిసిందేనని
కేసీఆర్
మండిపడ్డారు.
పసుపు
బోర్డు
పెడతానంటూ
బాండ్‌
పేపర్‌
ఇచ్చి
ఇంతవరకు
ఏర్పాటు
చేయలేదన్నారు.
బీజేపీకి
400
సీట్లనేది
ఉత్తమాటలేనని
చెప్పుకొచ్చారు.
మోడీ
పాలనను
ప్రశ్నించాను,
అందుకే
తన
బిడ్డ
కవితను
జైలులో
పెట్టారని
కేసీఆర్‌
చెప్పుకొచ్చారు.
అయినప్పటికీ
తన
గళాన్ని
ఆపేదిలేదని
స్పష్టం
చేశారు.

మరోవైపు,
కాంగ్రెస్‌పైనా
విమర్శలు
గుప్పించారు.
అడ్డగోలు
హామీలతో
కాంగ్రెస్
పార్టీ
అధికారంలోకి
వచ్చిందని
కేసీఆర్‌
విమర్శించారు.
కాంగ్రెస్
పాలనలో
నిజాంసాగర్
ప్రాజెక్టును
ఎడారి
చేశారని
మండిపడ్డారు.
బీఆర్ఎస్‌
పాలనలో
కరెంటు
కోతలు
లేవని,
రేవంత్
రాగానే
కోతలు
మొదలయ్యాయన్నారు.
వరి
పంటకు
రూ.
500
బోనస్
బోగస్
అయ్యిందన్నారు.
ఐదు
నెలల
పాలనలో
స్కాలర్‌షిప్‌లు,
కేసీఆర్
కిట్లు,
సీఎంఆర్ఎఫ్‌లు
ఆపేశారని
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
చేనేత
కార్మికుల
ఆత్మహత్యలు
మొదలయ్యాయని
విమర్శించారు.

తాను
రోడ్డెక్కగానే
కాంగ్రెస్
ప్రభుత్వం
రైతుబంధు
ప్రారంభించారని
కేసీఆర్‌
చెప్పుకొచ్చారు.
గ్యారెంటీల
అమలు
కోసం
కాంగ్రెస్
మెడలు
వంచుతామన్నారు.
బీఆర్ఎస్
గెలిస్తేనే
పథకాలన్నీ
అమలవుతాయని,
రుణమాఫీ
కోసం
పోరాటం
చేస్తామన్నారు.
రేవంత్
చేసేది
దేవుళ్ల
మీద
ఒట్లు,
కేసీఆర్‌పై
తిట్లని
మండిపడ్డారు.
ముస్లిం
మైనారిటీలు
కాంగ్రెస్‌కు
ఓటేస్తే
బీజేపీ
గెలుస్తుందని,
కాంగ్రెస్
బీజేపీ
రెండు
పార్టీలు
ఒక్కటేనని
ఆరోపించారు.
కాంగ్రెస్
ప్రభుత్వం
వచ్చిన
ఐదు
నెలల
పాలనలో
రాష్ట్రం
ఆగమైందని
విమర్శించారు.

English summary

BRS president kcr slams bjp for kavitha arrest issue in nizamabad lok sabha election campaign on monday.

Story first published: Monday, May 6, 2024, 23:03 [IST]

SOURCE :- ONE INDIA