Home వినోదం entertainment telgu అప్పుడే ఓటీటీలోకి ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’…

అప్పుడే ఓటీటీలోకి ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’…

2
0

SOURCE :- TELUGU ONE

అంజలి (Anajli) ప్రధాన పాత్ర పోషించిన హారర్ కామెడీ చిత్రం ‘గీతాంజలి’ 2014 లో విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్లకు ఈ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) సినిమా.. ఇటీవల థియేటర్లలో విడుదలైంది. అంజలి కెరీర్ లో 50వ చిత్రంగా రూపొందిన ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’.. ఏప్రిల్ 11న విడుదలై థియేటర్లలో నవ్వులు పూయించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.

‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా దక్కించుకుంది. ఈ చిత్రాన్ని మే 8 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ఆహా ప్రకటించింది. అంటే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలోకి రాబోతుందన్నమాట.

‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ రివ్యూ

ఎంవీవీ సినిమాస్‌, కోన ఫిలిం కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో అంజలి, శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌, సత్య, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శివ తుర్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కోన వెంకట్ కథ అందించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన ఈ చిత్రానికి ఛోటా కె. ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

SOURCE : TELUGU ONE