Home జాతీయ national telgu సెప్సిస్: ‘కుక్క నాకడం వల్ల’ అరుదైన జబ్బు.. రెండు కాళ్లు, రెండు చేతులూ కోల్పోయిన మహిళ

సెప్సిస్: ‘కుక్క నాకడం వల్ల’ అరుదైన జబ్బు.. రెండు కాళ్లు, రెండు చేతులూ కోల్పోయిన మహిళ

8
0

SOURCE :- BBC NEWS

మంజిత్ సంఘ, సెప్సిస్

(హెచ్చరిక: ఈ కథనంలోని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.)

ఆసుపత్రిలో 32 వారాలు ఉండి, పలుమార్లు వచ్చిన గుండెపోట్లను తట్టుకొని, రెండు చేతులు, రెండు కాళ్లనూ కోల్పోయి సెప్సిస్ నుంచి కోలుకొని, చివరకు ఇంటికి చేరారు మంజిత్ సంఘ.

యూకేకు చెందిన 56 ఏళ్ల మంజిత్ బతికే అవకాశం తక్కువని వైద్యులు మొదట్లో భావించారు. కానీ, ఆమె కోలుకుని, బుధవారం బర్మింగ్‌హామ్‌లోని మోస్లీ హాల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

వోల్వర్‌హాంప్టన్, స్టాఫోర్డ్‌షైర్ సరిహద్దుకు సమీపంలోని పెన్‌లో ఉంటున్న మంజిత్ కుటుంబం, ఆమెకు ఘనస్వాగతం పలికింది.

“మంజిత్ గాయాన్ని కుక్క నాకడం వల్ల” సెప్సిస్ వచ్చి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు.

యూకేకు చెందిన 56 ఏళ్ల మంజిత్ బతికే అవకాశం తక్కువని వైద్యులు మొదట్లో భావించారు. కానీ, ఆమె కోలుకుని, బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

‘ఎవరికైనా జరగొచ్చు’

ఇప్పుడు, మంజిత్ నెమ్మదిగా కోలుకుని తన జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే, సెప్సిస్ ప్రమాదం గురించి ఇతరులను హెచ్చరించాలనుకుంటున్నారు. ఇది ఎవరి జీవితంలోనైనా జరగొచ్చని ఆమె అంటున్నారు.

“నేనేం అనుభవించానో వివరించలేను. రోజుల వ్యవధిలోనే నేను నా చేతులు, కాళ్లనూ కోల్పోయాను. సెప్సిస్ చాలా తీవ్రమైనది, అసలు అశ్రద్ధ చేయకూడదు” అన్నారు మంజిత్.

సెప్సిస్ అరుదైన వ్యాధి. సాధారణంగా, శరీరంలోకి ప్రవేశించే ఇన్ఫెక్షన్లతో పోరాడే మన రోగనిరోధక వ్యవస్థ.. సొంత కణజాలాలు, అవయవాలపైనే దాడి చేయడం ప్రారంభిస్తుంది.

సెప్సిస్ ప్రాణాంతకమని, గుర్తించడం కష్టమని యూకే నేషనల్ హెల్త్ సెంటర్ చెబుతోంది. సెప్సిస్ కారణంగా యూకేలో ప్రతి సంవత్సరం 50,000 మంది వరకు మరణిస్తున్నట్లు యూకే సెప్సిస్ ట్రస్ట్ చెప్పింది.

సెప్సిస్ బారిన పడిన పెద్దలలో అస్పష్టమైన మాటలు, తీవ్రమైన వణుకు లేదా కండరాల నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం మచ్చలుగా లేదా రంగు మారడం వంటి లక్షణాలు ఉంటాయి.

మంజిత్ సంఘ, సెప్సిస్, యూకే

ఫొటో సోర్స్, Kam Sangha

అసలేమైంది?

అనారోగ్యం పాలు కాకపముందు, మంజిత్ సంఘ వారమంతా పనిచేసేవారు. గత ఏడాది జులైలో ఓ ఆదివారం మధ్యాహ్నం, ఆమె అనారోగ్యంతో ఇంటికి వచ్చారు.

మరుసటి రోజు ఉదయం స్పృహ కోల్పోయారు. ఆమె చేతులు, కాళ్లు చాలా చల్లగా అయిపోయాయి, పెదవులు ఊదా రంగులోకి మారాయి. ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు.

అంతా 24 గంటల్లోనే జరిగిపోయిందని మంజిత్‌ భర్త కామ్ సంఘ చెప్పారు.

“శనివారం ఆమె కుక్కతో ఆడుకున్నారు. ఆదివారం విధులకు వెళ్లారు. సోమవారం రాత్రి నాటికి కోమాలోకి వెళ్లారు” అన్నారాయన.

వోల్వర్‌హాంప్టన్‌లోని న్యూ క్రాస్ హాస్పిటల్‌లో ఇంటెన్సివ్ కేర్‌లో ఉండగా, మంజిత్ సంఘ గుండె ఆరుసార్లు ఆగిపోయింది. తరువాత, ఇన్ఫెక్షన్ వ్యాపించడంతో రెండు కాళ్లు, రెండు చేతులనూ తొలగించాల్సి వచ్చింది.

మాజీ ఫార్మసీ ఉద్యోగి అయిన మంజిత్ తన ప్లీహాన్ని(స్ప్లీన్) కూడా కోల్పోయారు. ఆమెకు నిమోనియా, పిత్తాశయ(గాల్‌బ్లాడర్) రాళ్లు వచ్చాయి. భవిష్యత్తులో ఆమెకు మరిన్ని శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు చెప్పారు.

మంజిత్ సంఘ, సెప్సిస్, యూకే

ఫొటో సోర్స్, Kam Sangha

“ఏం జరుగుతుందో తెలీదు. మొదటి నెల నాకేం గుర్తులేదు” అన్నారు మంజిత్.

స్క్రూఫిక్స్‌లో పనిచేసే ఆమె భర్త కామ్ సంఘ, ఏడు నెలల సెలవు తీసుకుని మంజిత్‌ను చూసుకున్నారు.

“ఆమె చాలా ధైర్యవంతురాలు” అన్నారాయన.

“ఈరోజే ఆమెకు చివరి రోజు అనుకునేవాళ్లం. కానీ, ఆమె ధైర్యంగా అవన్నీ తప్పని నిరూపించింది” అన్నారు కామ్ సంఘ.

ఆ జంట తమ 37వ వివాహ వార్షికోత్సవాన్ని ఆసుపత్రిలోనే గడిపారు. క్రిస్మస్ సమయంలో మంజిత్ పుట్టినరోజున కూడా వారు అక్కడే ఉన్నారు.

మంజిత్ సంఘ, సెప్సిస్, యూకే

‘నడిచే సమయం వచ్చింది’

ఈ జంట ఇప్పుడు అధునాతన ప్రాస్థెటిక్ అవయవాలను కొనడానికి డబ్బును సేకరిస్తున్నారు. ఇందులో రోబోటిక్ చేతులు కూడా ఉన్నాయి. వీటికి పది వేల పౌండ్లు(రూ.12 లక్షలు) వరకు ఖర్చవుతాయి.

ఇప్పటివరకు, వారు ‘గోఫండ్ మీ’ పేజీ, స్క్రూఫిక్స్‌లో నిధుల సేకరణ ద్వారా 22,000 పౌండ్లకు(రూ.27 లక్షలు) పైగా సేకరించారు. మంజిత్ తన ఫార్మసీ ఉద్యోగంతో పాటు స్క్రూఫిక్స్‌లో వారాంతపు షిఫ్ట్‌లలో కూడా పనిచేశారు. కోలుకోవడం కష్టమని ఆమెకు తెలుసు, కానీ ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిశ్చయించుకున్నారు.

“నేను మళ్లీ నడవాలనుకుంటున్నాను” అని ఆమె అంటున్నారు.

“నేను నా ప్రాస్థెటిక్ అవయవాలను అమర్చుకొని, తిరిగి పనికి వెళ్లాలనుకుంటున్నాను. ఇన్నిరోజులు కుర్చీలో కూర్చుని, మంచంలోనే పడుకుని ఉన్నా. ఇక నడిచే సమయం ఆసన్నమైంది” అంటున్నారు మంజిత్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)