SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Reuters
గల్ఫ్‌లోని మౌలిక వసతులపై ఇరాన్ చేస్తున్న దాడుల్లో భాగంగా యునైటెడ్ అరబ్ఎమిరేట్స్‌లోని ఫుజైరాలో ఉన్న అతి పెద్ద పోర్ట్, చమురు నిల్వ కేంద్రం, దుబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్లతో దాడులు చేసింది.
‘డ్రోన్ దాడులు’ కారణంగా ఎయిర్‌పోర్ట్ వద్ద మంటలు చెలరేగడంతో విమాన సేవల్ని తాత్కాలికంగా రద్దు చేశారు.
డ్రోన్ దాడితో ఫుజైరాలో వ్యూహాత్మకంగా ముఖ్యమైన పోర్ట్, ఇండస్ట్రియల్ జోన్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రాంతంలోని అతి పెద్ద చమురు నిల్వ కేంద్రాల్లో ఫుజైరా ఒకటి.
యూఏఈ రాజధాని అబుదాబి శివార్లలో కారు మీద రాకెట్ దాడి సంఘటనలో పాలస్తీనీయుడు ఒకరు చనిపోయినట్లు నగర మీడియా కార్యాలయం వెల్లడించింది.
అల్ బహియా ప్రాంతలో ఈ దాడి జరిగినట్లు తెలిపింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు ఆరు ఖండాంతర క్షిపణులు, 21 డ్రోన్లను అడ్డుకున్నట్లు యూఏఈ రక్షణ శాఖ వెల్లడించింది.

యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ ఇప్పటి వరకు యూఏఈ మీదకు 1900 క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది.
యుద్ధం మొదలైన తర్వాత దుబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మీద డ్రోన్ దాడి జరగడం ఇది మూడోసారి.
డ్రోన్ దాడి కారణంగా కొన్ని విమానాలు ఆలస్యం అయ్యాయి. మరికొన్ని రద్దయ్యాయి. మొత్తంగా ఈ దాడి భద్రత, సుస్థిరత విషయంలో యూఏఈకి ఉన్న ఇమేజ్‌ని దెబ్బతీసింది.
ఫొటో సోర్స్, EPA
యూఏఈ చమురు డిపోలపై డ్రోన్ దాడులు
యూఏఈ ఇంధన కేంద్రాలపై దాడుల్లో భాగంగా శనివారం ఆయిల్ నిల్వ ట్యాంకర్ మీద, సోమవారం చమురు నిల్వ కేంద్రాల మీద డ్రోన్ దాడులు జరిగాయి. డ్రోన్ దాడులతో చమురు నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగాయి.
డ్రోన్ దాడుల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు పోర్టులో చమురు లోడింగ్ కార్యకలాపాలను నిలిపివేశారు.
ఫుజైరా యూఏఈ తూర్పు తీరాన ఉంది. ఈ పోర్టును చేరుకునేందుకు నౌకలు హార్ముజ్ జలసంధిని దాటాల్సిన అవసరం లేదు.
వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటం వల్ల ఈ పోర్టు కీలక పాత్ర పోషిస్తోంది. “హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసినప్పుడు అంతర్జాతీయ నౌకలు వెళ్లేందుకు సాయపడుతోంది” అని దుబయికి చెందిన సీఈఓ మిడిల్ ఈస్ట్ వార్తా సంస్థ ఎడిటర్ జస్టిన్ హార్పర్ బీబీసీతో చెప్పారు.
ఆయన దుబయి చమురు పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లతో తరచుగా మాట్లాడుతూ ఉంటారు.
“ఇరాన్‌తో ఉద్రిక్తతల వల్ల కీలక మార్గంలో అంతరాయం ఏర్పడితే, యూఏఈ ఫుజైరా నుంచి పైపులైన్ల ద్వారా అబుదాబి చమురు క్షేత్రాలకు చమురు ఎగుమతి చేయగలదు” అని ఆయన చెప్పారు.
ఈ పోర్ట్ సిటీ “హార్ముజ్‌ను బైపాస్ చేసేందుకు ఇది కీలక ప్రాంతంలో ఉంది” అని దుబయికి చెందిన ఆయిల్ విశ్లేషకుడు కెప్లెర్‌కు కమోడిటీస్ డేటా అందించే మట్ స్టాన్లే చెప్పారు.
“యూఏఈ ప్రభుత్వ చమురు సంస్థ అడ్‌నాక్ చమురు ట్యాంకర్లు అక్కడున్నాయి. ఇదంతా క్రూడాయిల్. ఏసియన్ వ్యాపారులు దీన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు” అని స్టాన్లే అన్నారు.

ఫుజైరా పోర్టు కీలకం
ఫుజైరాలోని చమురు నిల్వ ట్యాంకర్, పైప్‌లైన్ మీద ఇరాన్ దాడి చేసింది. “గల్ఫ్ మౌలిక వసతులు ఎంత బలహీంగా ఉన్నాయో ఇది చూపిస్తోంది” అని స్టాన్లే బీబీసీతో చెప్పారు.
“చమురు సరఫరాకు అంతరాయం కలిగించాలని ఇరాన్ భావిస్తోంది” అని ఆయన అన్నారు.
ఈ ఓడరేవు భారత్‌కు దగ్గరగా ఉంది. “మిడిల్ ఈస్ట్ నుంచి సింగపూర్, చైనాకు వెళ్లే మార్గంలో ఇది మొదటి స్టాప్” అని స్టాన్లే అన్నారు.
“ఫుజైరా పాత సిల్క్‌రోడ్ సముద్ర మార్గంలో ఉంది. ఈ పోర్టు 25 లేదా 30 రోజులు సముద్రంలో ఉండే కంటైనర్ షిప్‌లకు ఆహారం, ఇంధనం, నీరు అందించే వ్యాపారం చేస్తోంది. రవాణా నౌకలకు ఫుజైరా అనేది పెద్ద వెండింగ్ మెషీన్” అని స్టాన్లే చెప్పారు.
దుబయి మీద దాడులు జరిగిన తర్వాత కూడా అక్కడి వ్యాపార వర్గాలు ధైర్యంగా ఉన్నాయి. ప్రజల్ని ఆకర్షించేందుకు రెస్టారెంట్లు ఆఫర్లు ఇస్తున్నాయి. మాల్స్‌లో ఇప్పటికీ రద్దీ కనిపిస్తోంది.
ప్రజలు “దుబయిని.. మాంద్యం నుంచి పుంజుకోవడంలో దానికున్న సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారు” అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



