SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
ఒక గంట క్రితం
చదివే సమయం: 2 నిమిషాలు
ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్, ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ ఐపీఎల్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన దేశంలో ‘డ్రింక్ డ్రైవింగ్'(డ్రంకెన్ డ్రైవ్) కేసులో దొరికాడు.
ఈస్ట్ సిడ్నీలోని మారోబ్రాలో ర్యాండమ్ బ్రీత్ టెస్ట్ లు చేసినప్పుడు 39 ఏళ్ల వార్నర్‌కు పాజిటివ్ రిజల్ట్ రావడంతో ఆదివారం ఆయన్ను అరెస్ట్ చేసినట్లు న్యూ సౌత్‌వేల్స్ పోలీసులు ధ్రువీకరించారు.
అనంతరం పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మరో టెస్ట్ లోనూ వార్నర్‌కు పాజిటివ్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు.
న్యూ సౌత్ వేల్స్ చట్టాల ప్రకారం రక్తంలో ఆల్కహాల్ సాంద్రత ఎంతవరకు ఉండొచ్చో అంతకు రెండింతలు కంటే ఎక్కువ ఉన్నట్లు టెస్టుల్లో తేలిందని పోలీసులు వెల్లడించారు.
బ్రీత్ టెస్టులు చేస్తున్న చోటికి కొంచెం ముందు ఒక వాహనం ఆపడాన్ని గుర్తించినట్టు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

మే 7న వార్నర్‌ను కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
వాహనం దగ్గరకు వెళ్లిన పోలీసులు అందులోని 39 ఏళ్ల డ్రైవర్‌కు(డేవిడ్ వార్నర్) టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందని చెప్పారు.
దాంతో ఆయన్ను అరెస్ట్ చేసి మారోబ్రా పోలీస్ స్టేషన్‌కు తరలించి అక్కడ మరోసారి టెస్ట్ చేయగా 0.104 రీడింగ్ వచ్చిందని తెలిపారు.
దీంతో వార్నర్‌పై అభియోగాలు నమోదు చేశారు. వార్నర్‌ను మే 7న కోర్టులో హాజరుపరుస్తారు.
2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్, ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ జట్టు కరాచీ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
వార్నర్ ఏప్రిల్ 9న పెషావర్ జల్మీతో జరగనున్న మ్యాచ్ లో ఆడాల్సి ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



