Home జాతీయ national telgu ‘గ్యాస్’ వదిలినప్పుడు దుర్వాసనకు కారణమేంటి? మీ పేగులు ఏం చెబుతున్నాయి?

‘గ్యాస్’ వదిలినప్పుడు దుర్వాసనకు కారణమేంటి? మీ పేగులు ఏం చెబుతున్నాయి?

15
0

SOURCE :- BBC NEWS

కడుపునొప్పి, దుర్వాసన, ఆరోగ్యం, పేగు ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

6 గంటలు క్రితం

చదివే సమయం: 4 నిమిషాలు

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి.

పిల్లల్లోనూ, పెద్దల్లోనూ పొట్టలో ఏర్పడే సమస్యల గురించి మేం గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ బసుమణితో మాట్లాడాం. మా ప్రశ్నలు, ఆయన జవాబులు చదవండి.

గ్యాస్ట్రో‌ఎంటరాలజిస్ట్, దుర్వాసన, ఆరోగ్యం, పేగు ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ప్రశ్న: కడుపు నొప్పి విషయంలో డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

జవాబు: మనుషుల పొట్టను పండోరా బాక్స్‌తో పోలుస్తారు. పొట్ట లోపల ఏముందో మనకు పూర్తిగా తెలియదు. ముందు రోజు రాత్రి ఎక్కువగా తినడం, బయట తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక, అజీర్తి వల్ల కడుపు నొప్పి రావచ్చు. ఆకలి వేయదు. ఇవన్నీ సాధారణమే. ఉపశమనానికి సోడా, నిమ్మరసం, మజ్జిగ, జీలకర్ర, అల్లం వంటివి తీసుకోవడంలో తప్పులేదు. కానీ, కడుపులో నొప్పి రావడానికి 100కు పైగా కారణాలు ఉన్నాయి.

డాక్టర్‌ను ఎప్పుడు కలవాలి?

జవాబు:

  • నిద్రకు భంగం కలిగించేంత నొప్పి
  • ప్రత్యేకంగా ఏ ఆహారం తినకపోయినా అకస్మాత్తుగా వచ్చే కడుపునొప్పి
  • 4, 5 గంటల పాటు నొప్పిగా ఉండడం.
  • 4, 5 వారాలపాటు కొనసాగే నొప్పి.
  • రోజురోజుకూ కడుపు నొప్పి పెరగడం.
  • వెన్నుభాగానికి వ్యాపించే నొప్పి.
  • తీవ్ర అలసట, తల తిరగడం.
  • హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం.
  • ఐరన్ లోపం.
  • స్కానింగ్‌లో కడుపు లేదా కాలేయంలో సమస్యలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
స్మోకింగ్, దుర్వాసన, ఆరోగ్యం, పేగు ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ప్రశ్న: భోజనం చేసిన వెంటనే పొగతాగితే ఎలాంటి సమస్యలొస్తాయి?

జవాబు: పొగాకు శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుంది. పాదం నుంచి తల వరకూ దాని ప్రభావం ఉంటుంది. పొగాకు కడుపును తేలికపరుస్తుంది. దీనివల్ల ఆకలి తగ్గొచ్చు. కానీ, స్ఫింక్టర్ కండరాలు వ్యాకోచిస్తే ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి వచ్చే సమస్య పెరుగుతుంది. అందుకే భోజనం తర్వాత పొగతాగడం మంచిది కాదు.

ప్రశ్న: ఉదయం నిద్రలేవగానే లాలాజలాన్ని మింగవచ్చా?

జవాబు: లాలాజలానికి బ్యాక్టీరియా నిరోధక గుణం ఉంది. నొప్పి తగ్గించే లక్షణం కూడా ఉంటుంది. పిల్లలకు దెబ్బతగిలితే అక్కడ ఉమ్మి రాయడం కొంతవరకు మంచిదే. దీనికి నొప్పి నివారణ, యాంటీబయాటిక్ ప్రభావం ఉన్నాయి.

లాలాజలంలో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అవి చెడ్డ బ్యాక్టీరియాలను పెరగనివ్వవు. దీనిని కాంపిటీటివ్ ఇన్హిబిషన్ అంటారు.

నోటిలో ఓ పెద్ద బ్యాక్టీరియాల ప్రపంచమే ఉంటుంది. కానీ, రాత్రివేళ నిద్రలో లాలాజల ఉత్పత్తి తగ్గుతుంది. నోరు పొడిబారడం వల్ల చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. పొద్దున్నే లేవగానే మన నోటిలో ఉండే బ్యాక్టీరియాలు మంచివి కావు. అయితే వాటిని మింగడం పెద్ద సమస్యేమీ కాదు. కడుపులో సరిపడా యాసిడ్ ఉంటే అవి అక్కడే నశించిపోతాయి.

కడుపునొప్పి, దుర్వాసన, ఆరోగ్యం, పేగు ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ప్రశ్న: కడుపులో పుండ్లకు, నోటిలో పుండ్లకు మధ్య ఏమైనా సంబంధం ఉందా?

జవాబు: ఇది సగం నిజం. కడుపు అనేది కేవలం పొట్ట భాగం మాత్రమే కాదు. దాని పొడవు(పేగు) సుమారు 8 మీటర్లు ఉంటుంది. చిన్నపేగు చివరన ఉండే చిన్న పుండైనా నోటిలోని బ్యాక్టీరియాల ప్రభావానికి లోనవ్వచ్చు.

నోటి పుండ్లకు చాలా కారణాలు ఉన్నాయి. పొట్టతో సంబంధం లేకుండా సిస్టమిక్ లూపస్ ఎరిత్రిమాటోసస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు, లైకెన్ ప్లానస్ వంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కడుపులోని సమస్యలు నోటి దుర్వాసనకు దారితీయవచ్చు.

ప్రశ్న: పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?

జవాబు: పేగుల ఆరోగ్యం మన ఆహారపు అలవాట్లు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ఇవి సరిగ్గా ఉంటే పేగులు తమను తామే సంరక్షించుకుంటాయి.

రాత్రివేళ పేగులు పారిశుధ్య కార్మికుడిలా పనిచేస్తాయి. మనం నిద్రపోతున్నప్పుడు అవి తమను తామే శుభ్రం చేసుకుంటాయి. 3 గంటలు ఆహారం తీసుకోకపోతే చిన్నపేగులో ఏమీ ఉండదు. దీనిని జెజునం అంటారు. జెజునం అంటే పేగు ఖాళీగా ఉండడం.

కడుపునొప్పి, దుర్వాసన, ఆరోగ్యం, పేగు ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ప్రశ్న: పేగుల ఆరోగ్యం కోసం ఏం చేయాలి?

జవాబు:

  • ఒత్తిడి లేకుండా, బాగా నిద్రపోవాలి.
  • ప్రాసెస్ చేసిన ఆహారాలు తినకూడదు.
  • సమతుల్య ఆహారం తీసుకోవాలి. కొంత ప్రోటీన్, విటమిన్ డీ, ఐరన్, మొక్కల నుంచి వచ్చే ఫైబర్ ఉండేలా చూసుకోవాలి.
  • బిస్కెట్లు, బర్గర్లు, పిజ్జాల్లో కూరగాయలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ లేకపోవడం వల్ల ఇవి పేగుల ఆరోగ్యానికి మంచివి కావు.

ఇవి ఎక్కువగా తింటే:

  • ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్.
  • భోజనం చేసినప్పుడు వాంతి వచ్చే భావన.
  • ఇన్‌ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్.
  • పేగుల క్యాన్సర్.
  • పార్కిన్సన్ వ్యాధి.
  • డిప్రెషన్.
  • చర్మ అలర్జీలు.
  • కీళ్లనొప్పులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
దుర్వాసన, ఆరోగ్యం, పేగు ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ప్రశ్న: దుర్వాసనతో గ్యాస్(అపానవాయువు) విడుదల కావడానికి కారణం ఏమిటి? అది పేగు సమస్యకు సంకేతమా?

జవాబు: ఫైబర్ జీర్ణమయ్యేటప్పుడు గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళతాయి. మీథేన్, సల్ఫైడ్‌ ఒత్తిడితో బయటకు రావడం వల్ల దుర్వాసన వస్తుంది.

కొన్ని బ్యాక్టీరియాలు మన ఆహార అలవాట్ల వల్ల పెరుగుతాయి. కొన్ని ఆహారాలు తప్పకుండా దుర్వాసనను కలిగిస్తాయి. అలాగే పేగుల ఆరోగ్యం, నిద్ర, ఒత్తిడి, బ్యాక్టీరియా – ఇవన్నీ దుర్వాసనకు కారణమవుతాయి. ఉదయం లేచినప్పుడు గ్యాస్ రావడం సహజం.

రోజుకు 20, 30 సార్లకు మించి శబ్దంతో గ్యాస్ విడుదలైతే, పేగుల బ్యాక్టీరియా ఎందుకు మారిందో పరిశీలించాలి. అది ఆహారం వల్లనా లేదా ఇతర కారణాల వల్లనా తెలుసుకుని పరిష్కారం వెతకాలి.

ప్రశ్న: పేగుల ఆరోగ్యానికి చద్దన్నం నిజంగా మంచిదేనా?

జవాబు: సందేహమే లేదు . చద్దన్నానికి 10కి 10 మార్కులు ఇవ్వొచ్చు. ఇది ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఎక్కువగా తినేవారికి మాత్రం జీర్ణం కావడం కష్టం కావొచ్చు. చద్దన్నంలో క్యాలరీలు, స్వచ్ఛమైన పిండి పదార్థాలు ఉంటాయి. అయితే మితంగా తీసుకోవాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)