Home జాతీయ national telgu ఇంటర్మీడియట్ విద్యార్థినిపై అత్యాచారం, హత్య.. తూత్తుకుడిలో 98 సీసీటీవీ కెమేరాలు, 2574 సెల్‌ఫోన్ నంబర్లు పరిశీలించి...

ఇంటర్మీడియట్ విద్యార్థినిపై అత్యాచారం, హత్య.. తూత్తుకుడిలో 98 సీసీటీవీ కెమేరాలు, 2574 సెల్‌ఫోన్ నంబర్లు పరిశీలించి నిందితుడిని ఎలా పట్టుకున్నారంటే?

26
0

SOURCE :- BBC NEWS

తూత్తుకుడి, చెన్నై, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధిని, పోలీసులు, నేరాలు, నిందితుడు, హత్య, అత్యాచారం

ఒక గంట క్రితం

చదివే సమయం: 4 నిమిషాలు

(గమనిక: ఈ కథనంలో కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)

తమిళనాడులోని తూత్తుకుడిలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నఒక విద్యార్థినిపై దుండగుడు లైంగికంగా దాడి చేసి హత్య చేశారని ఆ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మదన్ విలేఖరుల సమావేశంలో తెలిపారు.

నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్‌ సహా సైంటిఫిక్ ఎవిడెన్స్‌తో అరెస్ట్ చేశారు.

విద్యార్థినిపై మొదట అత్యాచారం చేసి, తరువాత హత్య చేశారని మదన్ తెలిపారు.

ఇంటర్మీడియట్ చదువుతున్న తమ కుమార్తె కనిపించడం లేదంటూ తూత్తుకుడి జిల్లాలోని ఒక గ్రామంలో నివసించే ఆమె తల్లిదండ్రులు మార్చి10న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు.

కాలకృత్యాలు తీర్చుకోవడానికి పక్కనే ఉన్న అడనికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదని తల్లిదండ్రులు చెప్పారని ఆయన అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
తూత్తుకుడి, చెన్నై, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధిని, పోలీసులు, నేరాలు, నిందితుడు, హత్య, అత్యాచారం

ఫొటో సోర్స్, Facebook/Madhan

అయితే మొదట్లో ఫిర్యాదు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆ విద్యార్థిని తండ్రి మీడియాతో చెప్పారు.

గ్రామస్తులతో కలిసి అడవిలో గాలించినా తమ కుమార్తె జాడ తెలియలేదని ఆయన అన్నారు.

మరుసటి రోజు (మార్చి 11న), అడవి ప్రాంతంలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆ విద్యార్థిని మృతదేహం కనిపించిందని, ఆ తర్వాతే పోలీసులు ఘటన స్థలానికి వచ్చారని గ్రామస్తులు ఆరోపించారు.

నిందితుడిని పట్టుకోవడంలో ఆలస్యం కావడంతో గ్రామానికి చెందిన ప్రజలు వరుస నిరసనలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో విద్యార్థిని హత్య కేసులో ధర్మమునీశ్వరన్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తూత్తుకుడి జిల్లా పోలీసులు తెలిపారు.

ఈ కేసులో నిందితుడిని ఎలా గుర్తించారనేది తూత్తుకుడి ఎస్‌పీ మదన్ విలేఖరుల సమావేశంలో వివరించారు.

“ఈ కేసులో పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. అందులో నలుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఆరుగురు పోలీస్ ఇన్‌స్పెక్టర్లు సహా మొత్తం 150 మంది ఉన్నారు” అని ఆయన తెలిపారు.

“సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేశాం. ఫింగర్‌ప్రింట్ నిపుణులు, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలంలో ఆధారాలను సేకరించి వేర్వేరు నివేదికలు అందించారు. అనేక కోణాల్లో దర్యాప్తు చేశాం. సంఘటన స్థలంలో సీసీటీవీ లేకపోయినా, ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించాం” అని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మదన్ తెలిపారు.

“మేం 98 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాం. సంఘటన జరిగిన రోజున ఆ ప్రాంతంలో వాడుకలో ఉన్న 2574 సెల్‌ఫోన్ నంబర్లను పరిశీలించాం. జైలు నుంచి బయటకు వచ్చినవారు సహా క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారి జాబితాను సేకరించి దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం” అని జిల్లా ఎస్పీ వివరించారు.

తూత్తుకుడి, చెన్నై, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధిని, పోలీసులు, నేరాలు, నిందితుడు, హత్య, అత్యాచారం

‘శిక్ష పడేలా చూస్తాం’

“ఈ కేసు దర్యాప్తులో మేం నేరచరిత్ర ఉన్న 461 మందిని నేరుగా విచారించాం. వారిచ్చిన సమాచారాన్ని డిజిటల్ ఆధారాల ద్వారా పరిశీలించాం. విచారణ తర్వాత ఒకరిని అరెస్ట్ చేశాం” అని మదన్ చెప్పారు.

“సంఘటనా స్థలంలో లభించిన బలమైన ఆధారాలు, సెల్‌ఫోన్ కాల్స్, సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించాం. శాస్త్రీయంగా విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేశాం” అని మదన్ అన్నారు.

అరెస్ట్ చేసిన వ్యక్తిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని ఎస్‌పీ తెలిపారు.

“త్వరలో చార్జ్ షీట్ దాఖలు చేస్తాం. అతనికి గరిష్ఠంగా శిక్ష పడేలా చూస్తాం. ఈ నేరంలో మరెవరైనా పాల్గొన్నారా అన్నదానిపైనా దర్యాప్తు కొనసాగుతోంది” అని అన్నారు.

“విద్యార్థిపై లైంగిక దాడి జరిగిందా?” అని విలేఖరులు అడగ్గా… “లైంగిక దాడి తర్వాత ఆమెను హత్య చేశారు. అవసరమైన ఆధారాలు సేకరించి పంపించాం. కేసు దర్యాప్తులో ఉండటం వల్ల ఇంకా ఎక్కువ వివరాలు చెప్పడం వీలుకాదు” అని ఆయన సమాధానమిచ్చారు.

“ఒకరిని అరెస్ట్ చేయడానికి తొమ్మిది రోజులు ఎందుకు పట్టింది?” అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు, “గ్రామంలోని ప్రజలు చెప్పేది నిజమా… గ్రామం దగ్గర నివసించే వారు చెప్పేది నిజమా అని మేం వేర్వేరుగా విచారణ చేశాం” అని ఆయన సమాధానమిచ్చారు.

రాబోయే రోజుల్లో గ్రామాల్లో మరిన్ని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, పోలీస్ పర్యవేక్షణను (పెట్రోలింగ్‌ను) మరింత పెంచుతామని జిల్లా ఎస్‌పీ మదన్ చెప్పారు.

విద్యార్థిని హత్య కేసులో ఒకరిని అరెస్ట్ చేసిన తర్వాత.. విద్యార్ధిని మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)