Home జాతీయ national telgu ఆస్కార్స్ 2026: ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్‌’కు ‘బెస్ట్ ఫిల్మ్’ సహా 6 అవార్డులు

ఆస్కార్స్ 2026: ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్‌’కు ‘బెస్ట్ ఫిల్మ్’ సహా 6 అవార్డులు

10
0

SOURCE :- BBC NEWS

ఉత్తమ నటి: జెస్సీ బక్లీ (హామ్నెట్)

ఫొటో సోర్స్, The Academy via Getty Images

    • రచయిత, లీరె వెంటాస్
    • హోదా, బీబీసీ న్యూస్, లాస్ ఏంజలెస్ నుంచి
  • 16 మార్చి 2026, 10:55 IST

  • చదివే సమయం: 7 నిమిషాలు

ఈ ఏడాది ఆస్కార్ పురస్కారాల్లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా ‘ఉత్తమ చిత్రం’ సహా అరు కేటగిరీల్లో అవార్డులను గెలుచుకుంది. ఈ విజయంతో దర్శకుడు పాల్ థామస్ అండర్సన్ పేరు మరోసారి చర్చల్లో నిలిచింది.

ఉత్తమ చిత్రం అవార్డును ప్రకటించగానే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమా నటులు టెయానా టేలర్, చేజ్ ఇన్ఫినిటీ ఆనందంతో గంతులేశారు.

అలాగే ‘సిన్నర్స్’ సినిమాకు నాలుగు అవార్డులు లభించాయి. ఈ సినిమా రికార్డు స్థాయిలో 16 కేటగిరీల్లో ఆస్కార్‌కు నామినేట్ అయింది.

‘1975లో ఆస్కార్ బరిలో బ్యారీ లిండన్, డాగ్ డే ఆఫ్టర్‌నూన్, జాస్, నాష్‌విల్లే, వన్ ఫ్లూ ఓవర్ ది కుకూస్ సెస్ట్ సినిమాలు నిలిచాయి. వీటిలో ఏదీ తక్కువ కాదు. ఆ సమయంలో ఒక ప్రత్యేకమైన వాతావరణం నెలకొంది. ఇప్పుడు మేం కూడా ఈ వేడుకలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది కూడా చాలా అద్భుతమైన సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి’ అని దర్శకుడు అండర్సన్ వ్యాఖ్యానించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా మొత్తం 13 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు ఆరు అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ క్యాస్టింగ్, ఉత్తమ సహాయ నటుడు, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ కేటగిరీల్లో ఈ సినిమా ఆస్కార్ పురస్కారాన్ని అందుకుంది.

అమెరికాలోని లాస్ ఏంజలెస్‌లో 98వ అకాడమీ అవార్డుల వేడుక జరుగుతోంది. సినిమా రంగానికి సంబంధించి వివిధ కేటగిరీల్లో ఉత్తమ ప్రదర్శనలకు ఈ అవార్డును అందజేస్తారు.

ఉత్తమ సహాయ నటి ఎమీ మాడిగన్

ఫొటో సోర్స్, Getty Images

అండ్ ది ఆస్కార్ అవార్డ్ గోస్ టు..

ఉత్తమ చిత్రం: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

ఉత్తమ డైరెక్టర్: పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్ట్ అనదర్)

ఉత్తమ నటుడు: మైఖేల్ బి. జోర్డాన్ (సిన్నర్స్)

ఉత్తమ సహాయ నటుడు: సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)

ఉత్తమ నటి: జెస్సీ బక్లీ (హామ్నెట్)

ఉత్తమ సహాయ నటి: ఎమీ మాడిగన్ (వెపన్స్)

ఉత్తమ యానిమేషన్ చిత్రం: కేపాప్ డేమాన్ హంటర్స్

ఉత్తమ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్: ద గర్ల్ హూ క్రైడ్ పెరల్స్

ఉత్తమ క్యాస్టింగ్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

ఉత్తమ సినిమాటోగ్రఫీ: సిన్నర్స్

ఉత్తమ క్యాస్ట్యూమ్ డిజైన్: ఫ్రాంకెస్టీన్

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: మిస్టర్ నోబడీ అగెనెస్ట్ పుతిన్

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ఆల్ ద ఎంప్టీ రూమ్స్

ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: సెంటిమెంటల్ వాల్యూ (నార్వే)

ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది సింగర్స్

ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలింగ్: ఫ్రాంకెస్టీన్

ఉత్తమ మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్: సిన్నర్స్

ఉత్తమ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్: గోల్డెన్ (కేపాప్ డేమాన్ హంటర్స్)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ఫ్రాంకెస్టీన్

ఉత్తమ సౌండ్: ఎఫ్‌1

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్: అవతార్ ఫైర్ అండ్ యాష్

ఉత్తమ రైటింగ్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

ఉత్తమ రైటింగ్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: సిన్నర్స్

భర్త నిక్ జోనస్‌తో ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న ప్రియాంకా చోప్రా

ఫొటో సోర్స్, AFP via Getty Images

హోస్ట్‌గా ప్రియాంకా చోప్రా

నిరుడు ఆస్కార్ వేడుకల్లో వ్యాఖ్యాతగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన కానన్ ఓబ్రియన్, ఈ ఏడాది కూడా ఆస్కార్ వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

విజేతలకు అవార్డులను అందజేయడానికి పలువురు సినీ తారలను కూడా ఆహ్వానించారు.

ఈ ఏడాది పెద్ద సినిమాల్లో నటించి, వ్యక్తిగతంగా ఆస్కార్‌కు నామినేట్ కాని తారలు పాల్ మెస్కల్ (హామ్నెట్), చేజ్ ఇన్ఫినిటీ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్), గ్వినేత్ పాల్‌త్రో (మార్టీ సుప్రీమ్)‌లతో పాటు నికోల్ కిడ్మాన్, ప్రియాంకా చోప్రా జోనస్, రాబర్ట్ డౌనీ జూనియర్, యెన్ హాథ్‌వే, క్రిస్ ఇవాన్స్ వంటి ప్రముఖ తారలను అవార్డులు అందించడానికి ఆహ్వానించారు.

సంప్రదాయం ప్రకారం, గతేడాది అవార్డులు గెలుచుకున్న నలుగురు నటులు అడ్రియన్ బ్రాడీ, మికీ మ్యాడిసన్, కీరన్ కల్కిన్, జో సల్డానా కూడా అవార్డులను అందించే వారి జాబితాలో ఉన్నారు.

ఆస్కార్ వేడుకల ఫోటోలు

కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్ వేదికగా జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుకకు హాజరైన ‘వన్ బ్యాటిల్ఆఫ్టర్ అనదర్’ సినిమా నటులు టెయానా టేలర్, చేజ్ ఇన్ఫినిటీ హాలీవుడ్

ఫొటో సోర్స్, AFP via Getty Images

అమెరికా ఫిల్మ్ మేకర్ పాల్ థామస్ అండర్సన్, వన్ బ్యాటిల్  ఆఫ్టర్ అనదర్ సినిమాకు గానూ ఆస్కార్ గెలుచుకున్నారు. ఇప్పటివరకు 14 సార్లు నామినేట్ అయిన ఆయనకు ఇదే తొలి ఆస్కార్ అవార్డు

ఫొటో సోర్స్, AFP vía Getty Images

తన సినిమా ‘సిన్నర్స్’కు ‘బెస్ట్ ఒరిజినల్ స్కీన్‌ప్లే’ విభాగంలో లభించిన ఆస్కార్‌ను చేతిలో పట్టుకున్న అమెరికా దర్శకుడు, నిర్మాత రెయాన్ కూగ్లర్

ఫొటో సోర్స్, AFP vía Getty Images

ఫ్రాంకెస్టీన్ సినిమాకు గానూ మేకప్, హెయిర్ స్టయిల్ ఆర్టిస్టులుగా పనిచేసిన జోర్డాన్ శామ్యూల్, మైక్ హిల్‌లను అభినందిస్తున్న మెక్సికన్ దర్శకుడు గిలెర్మో డెల్ టోరో

ఫొటో సోర్స్, AFP vía Getty Images

ఫ్రాంకెస్టీన్‌ సినిమాకు  బెస్ట్ కాస్యూమ్ డిజైన్ విభాగంలో ఆస్కార్ అందుకున్న తర్వాత ఆనందంతో కేట్ హాలీ

ఫొటో సోర్స్, Getty Images

బెస్ట్ యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ పొందిన కేపాప్ డేమాన్ హంటర్స్ సినిమా దర్శకుడు క్రిస్ అపెల్‌హాన్స్, దక్షిణకొరియా-కెనడా స్క్రీన్ రైటర్ మ్యాగీ కాంగ్, నిర్మాత మిషెల్ వెంగ్

ఫొటో సోర్స్, AFP vía Getty Images

డాల్బీ థియేటర్ రెడ్ కార్పెట్‌పై అద్భుతమైన డియోర్ డ్రెస్‌లో కనిపించిన ‘ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్, ఐ వుడ్ హావ్ కిక్ యూ’ స్టార్ రోజ్ బర్న్

ఫొటో సోర్స్, Getty Images

సిన్నర్స్ సినిమాలో కవలలుగా నటించిన మైకేల్ బీ జోర్డాన్

ఫొటో సోర్స్, AFP vía Getty Images

ఆస్కార్ అవార్డుల్లో ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిన నార్వే స్టార్ రెనెట్ రెన్స్వే

ఫొటో సోర్స్, Penske Media vía Getty Images

ది సీక్రెట్ ఏజెంట్ స్టార్ వాగ్నర్ మౌరా

ఫొటో సోర్స్, Getty Images

ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న లియోనార్డో డికాప్రియో

ఫొటో సోర్స్, AFP vía Getty Images

హామ్నెట్‌ సినిమాలో షేక్‌స్పియర్ భార్యగా నటించిన జెసీ బక్లీ ఈ చిత్రానికి గానూ ‘ఉత్తమ నటి’ విభాగంలో అవార్డును అందుకున్నారు

ఫొటో సోర్స్, Getty Images

సుప్రీం మార్టీ సినిమాకు గానూ ఆస్కార్‌కు నామినేట్ అయిన టియోథీ షాలోమ్

ఫొటో సోర్స్, AFP vía Getty Images

సిల్వర్ లూయీ విట్టన్ దుస్తుల్లో మెరిసిపోతున్న బుగోనియా స్టార్ ఎమ్మా స్టోన్

ఫొటో సోర్స్, Getty Images

జాకబ్ ఎలోర్డీ

ఫొటో సోర్స్, AFP vía Getty Images

బెనిసియో డెల్

ఫొటో సోర్స్, Getty Images

చేజ్ ఇన్ఫినిటీ

ఫొటో సోర్స్, WWD vía Getty Images

దర్శకుడు ఓలివర్ లాక్సే

ఫొటో సోర్స్, Getty Images

టెయానా టేలర్

ఫొటో సోర్స్, AFP vía Getty Images

ప్రాడా డ్రెస్‌లో సందడి చేసిన బ్రిటిష్ స్టార్ ఫెలిసిటీ జోన్స్

ఫొటో సోర్స్, FilmMagic

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)