Home జాతీయ national telgu Ind Vs Zim: అర్ధ సెంచరీలతో చెలరేగిన అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్య, జింబాబ్వే...

Ind Vs Zim: అర్ధ సెంచరీలతో చెలరేగిన అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్య, జింబాబ్వే లక్ష్యం 257 పరుగులు

8
0

SOURCE :- BBC NEWS

ఇండియా వర్సెస్ జింబాబ్వే, టీట్వంటీ వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

3 గంటలు క్రితం

చదివే సమయం: 3 నిమిషాలు

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 256 పరుగులు సాధించింది. జింబాబ్వే ముందు 257 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది.

దీనితో ఈ ప్రపంచ కప్‌లో అత్యధిక స్కోరు సాధించిన రికార్డును కూడా భారత్ సృష్టించింది.

భారత్ బ్యాట్స్‌మెన్లలో అభిషేక్ శర్మ, హార్డిక్ పాండ్యా అర్థ శతకాలు సాధించారు.

హార్డిక్ పాండ్యా 50 (23 బంతుల్లో), తిలక్ వర్మ 44 (16 బంతుల్లో) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

అభిషేక్ శర్మ 54, ఇషాన్ కిషన్ 38, సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు చేశారు.

అభిషేక్ శర్మ 26 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు, శర్మ నాలుగు మ్యాచుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు.

చివర్లో వచ్చిన తిలక్ వర్మ హార్దిక్ పాండ్యాకు తోడు కావడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

భారత్ ఇన్నింగ్స్‌లో 17 సిక్సర్లు ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో భారత జట్టు సాధించిన అత్యధిక సిక్సర్లు ఇవే.

జింబాబ్వే జట్టులో రిచర్డ్, ముజర్బానీ, టినోటెండా, కెప్టెన్ సికందర్ రజాలు తలో వికెట్ తీశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఇండియా వర్సెస్ జింబాబ్వే, టీట్వంటీ వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

అంతకు ముందు జింబాబ్వే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

భారత్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించిన ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు ఫోర్లు సిక్సులతో తొలి మూడు ఓవర్లలోనే స్కోరును 45 పరుగులు దాటించారు.

అయితే 3.4 ఓవర్ల వద్ద భారత్ తొలి వికెట్ పడింది. సంజు శాంసన్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి అవుటయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 48 పరుగులు.

ముజర్బానీ బౌలింగ్ లో బర్ల్‌కు క్యాచ్ ఇచ్చి శాంసన్ పెవిలియన్ దారిపట్టాడు.

మంచి ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 38 పరుగులు చేసి ఔటయ్యాడు.

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్ కోసం భారత్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చేసింది. జింబాబ్వే తమ జట్టులో ఒక మార్పు చేసింది. భారత జట్టులో అక్షర్ పటేల్, సంజు శాంసన్ తిరిగి చేరారు.

ఈ మ్యాచ్‌లో భారత ప్లేయింగ్ 11 నుంచి వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్‌లను తప్పించారు.

సెమీఫైనల్స్ రేసులో భారత్ నిలవాలంటే ఈ మ్యాచ్ చాలా కీలకం.

ఇందులో భారత్ జింబాబ్వేను ఓడించగలిగితే, సెమీఫైనల్‌కు చేరుకోవడానికి వెస్టిండీస్‌ను కూడా ఓడించాల్సి ఉంటుంది.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)