Home జాతీయ national telgu Ind Vs Eng: మరోసారి సంజూ సూపర్ ఇన్నింగ్స్, ఇంగ్లండ్ టార్గెట్ 254

Ind Vs Eng: మరోసారి సంజూ సూపర్ ఇన్నింగ్స్, ఇంగ్లండ్ టార్గెట్ 254

11
0

SOURCE :- BBC NEWS

క్రికెట్, భారత్, ఇంగ్లండ్, టీ20 వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

5 మార్చి 2026, 19:14 IST

అప్‌డేట్ అయ్యింది ఒక గంట క్రితం

చదివే సమయం: 3 నిమిషాలు

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.

ఇంగ్లండ్‌కు 254 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ జట్టు ఆది నుంచి ధాటిగా ఆడింది. ఓపెనర్ సంజూ శాంసన్ సూపర్ ఇన్నింగ్స్‌తో భారత జట్టు భారీ స్కోరు చేసింది.

సంజూ శాంసన్ 89, శివమ్ దుబే 43, ఇషాన్ కిషన్ 39 పరుగులు చేశారు.

క్రికెట్, ఇండియా, ఇంగ్లండ్

ఫొటో సోర్స్, Getty Images

స్కోరు బోర్డును ముందుకు నడిపించిన సంజూ – ఇషాన్

ఆరంభంలోనే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 7 బంతుల్లో 9 పరుగులు చేసిన అభిషేక్.. 2వ ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. విల్ జాక్స్ అతని వికెట్ తీశాడు.

డ్రింక్స్ బ్రేక్ సమయానికి ఒక వికెట్ నష్టపోయి 67 పరుగులు చేసింది భారత జట్టు.

అనంతరం, ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ శాంసన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

భారత్ 10 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.

ఓపెనర్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 26 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు.

18 బంతుల్లో 39 పరుగులు చేసిన ఇషాన్.. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో జాక్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు.

14వ ఓవర్ తొలి బంతికి, భారత్ స్కోర్ 160 పరుగుల వద్ద సంజూ ఔటయ్యాడు.

సంజూ 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. సంజూ వికెట్ విల్ జాక్స్‌కు దక్కింది.

టీం ఇండియా 15 ఓవర్లు పూర్తయ్యే సమయానికి, మూడు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది.

అనంతరం, 16వ ఓవర్ నాలుగో బంతికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్

ఫొటో సోర్స్, Getty Images

సిక్సర్లతో ఫామ్‌లో ఉన్న శివమ్ దుబే 43 పరుగులు చేశాడు. 18వ ఓవర్ మూడో బంతికి రనౌట్‌ అయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ వెంటవెంటనే 3 సిక్సర్లు కొట్టి రన్‌రేట్ పెంచాడు.

కేవలం 7 బంతుల్లో 21 పరుగులు చేసిన తిలక్ వర్మ ఆర్చర్ వేసిన యార్కర్‌తో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

హార్డిక్ పాండ్యా 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. 19 ఓవర్ 5వ బంతికి రెండో రన్ కోసం ప్రయత్నిస్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు.

మొత్తం 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత జట్టు 253 పరుగులు చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

భారత్:

సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లండ్:

ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బెంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.

ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఎలాంటి మార్పులూ లేవు. అయితే, ఇంగ్లండ్ జట్టులో ఒక మార్పు జరిగింది.

ప్లేయింగ్ 11లో రెహాన్‌కు బదులు ఓవర్టన్‌కు చోటు కల్పించినట్లు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తెలిపాడు.

క్రికెట్, టీమిండియా, ఇంగ్లండ్, టీ20 వరల్డ్‌కప్

ఫొటో సోర్స్, Getty Images

బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మార్చి 8న జరిగే ఫైనల్‌లో న్యూజీలాండ్‌తో తలపడనుంది.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)