Home జాతీయ national telgu వెండింగ్ మెషిన్‌లో స్ట్రాను నాకి పెట్టిన యువకుడు, జైలు శిక్ష, జరిమానాకు అవకాశం

వెండింగ్ మెషిన్‌లో స్ట్రాను నాకి పెట్టిన యువకుడు, జైలు శిక్ష, జరిమానాకు అవకాశం

26
0

SOURCE :- BBC NEWS

వెండింగ్ మెషిన్ స్ట్రా

ఫొటో సోర్స్, Getty Images

సింగపూర్‌లో ఆరెంజ్ జ్యూస్ వెండింగ్ మెషీన్ నుంచి ఒక స్ట్రాను తీసి, దాన్ని నాకి, తిరిగి డిస్పెన్సర్‌లో పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఫ్రెంచ్ యువకుడికి జైలు శిక్ష పడింది.

తుంటరిపని, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి అభియోగాల కింద కేసు నమోదైంది.

ఈ తుంటరి (పిచ్చి) పని చేస్తూ తనకు తానుగా తీసుకున్న వీడియోను 18 ఏళ్ల డిడియర్ గాస్పర్డ్ ఓవెన్ మ్యాక్సిమిలియన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసినట్లు స్థానిక కథనాలు నివేదించాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన తర్వాత ఈ వీడియో విపరీతంగా సర్క్యూలేట్ అయింది.

వెండింగ్ మెషిన్ కంపెనీ ఐజూజ్, ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత మెషీన్ డిస్పెన్సర్‌లో ఉన్న మొత్తం 500 స్ట్రాలను రీప్లేస్ చేసినట్లు ప్రకటించింది.

ఈ యువకుడిపై నమోదైన రెండు అభియోగాల్లో దోషిగా తేలితే, మ్యాక్సిమిలియన్‌కు గరిష్ఠంగా రెండేళ్లకు పైనే జైలు శిక్ష పడనుంది. వేల డాలర్లలో జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ సంఘటన మార్చి 12న సింగపూర్‌లోని ఓ షాపింగ్ సెంటర్‌లో జరిగింది.

‘నగరం సురక్షితంగా లేదు’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా ఈ వీడియోను మ్యాక్సిమిలియన్ పోస్టు చేసినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చాలామంది ఆన్‌లైన్ ప్రేక్షకులు ఈ వీడియోను చూసి, మ్యాక్సిమిలియన్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

కమ్యూనిటీ పేజీల్లో ఈ వీడియోను రీపోస్టు చేయగా.. స్థానిక న్యూస్ అవుట్‌లెట్లు వెంటనే ఈ వార్తను ప్రచురించాయి.

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చానెల్ న్యూస్ ఏసియా (సీఎన్ఏ)కు ఐజూజ్ కంపెనీ తెలిపింది.

వెంటనే శానిటేషన్ నిబంధనలను చేపట్టామని, వెండింగ్ మెషిన్ పూర్తిగా శుభ్రపరిచినట్లు ఐజూజ్ పేర్కొంది.

మ్యాక్సిమిలియన్ ప్రస్తుతం ఎస్సెక్ బిజినెస్ స్కూల్‌లో సింగపూర్ బ్రాంచ్ విద్యార్థి.

ఈ ఘటన గురించి తమకు తెలుసని, ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయని స్కూల్ అధికార ప్రతినిధి ఒకరు పలు వార్తా సంస్థలకు వెల్లడించారు.

మ్యాక్సిమిలియన్ తల్లిదండ్రులు సింగపూర్‌కు చేరుకున్నారని, ఆయన స్కూల్ ప్రతినిధి ఒకరు బెయిలర్‌గా ఉన్నారని ఆయన తరఫున వాదించిన న్యాయవాదులు అంతకుముందు న్యూస్ చానెల్ సీఎన్ఏకు చెప్పారు.

కోర్టులో ఈ కేసు మే 22న మరోమారు విచారణకు రానుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)