Home జాతీయ national telgu రెస్ట్ తీసుకుంటూ డ్రోన్ కెమెరాకు చిక్కిన పెద్దపులి

రెస్ట్ తీసుకుంటూ డ్రోన్ కెమెరాకు చిక్కిన పెద్దపులి

20
0

SOURCE :- BBC NEWS

రెస్ట్ తీసుకుంటూ డ్రోన్ కెమెరాకు చిక్కిన పెద్దపులి

ఒక గంట క్రితం

పెద్దపులి హాయిగా సేదతీరుతున్న ఈ దృశ్యాలు ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ డ్రోన్ కెమెరాకు చిక్కాయి. పాపికొండల అభయారణ్యంలో ఈ వీడియోను చిత్రీకరించారు.

తర్వాత, ఈ పులి పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలోకి ప్రవేశించిందని అధికారులు తెలిపారు.

అంతకుముందు కాకినాడ జిల్లా ఏలేరు ప్రాంతంలో పశువులపై దాడి చేసిందని.. అనంతరం దిశ మార్చుకుని బోర్నగూడెం పరిసర ప్రాంతాల్లోకి వచ్చిందని అటవీశాఖ అధికారులు గుర్తించారు.

ఈ పెద్దపులి మెడలో రేడియో కాలర్ ఉంది. దాని నుంచి వచ్చే సిగ్నళ్ల ఆధారంగా పులి ఎటు వెళ్తోందో ట్రాక్ చేస్తున్నారు.

నాగార్జునసాగర్ నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ సహా ఐదు బృందాలతో ఈ పెద్దపులిని బంధించేందుకు ఆపరేషన్ చేపడుతున్నారు. డ్రోన్ కెమెరాలతో గాలిస్తున్నారు.

జంతువులు, పులి, ఆంధ్రప్రదేశ్, పోలవరం

ఫొటో సోర్స్, UGC

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)