Home జాతీయ national telgu అమెరికాలో మంచు తుపాను.. 5,000కు పైగా విమానాలు రద్దు

అమెరికాలో మంచు తుపాను.. 5,000కు పైగా విమానాలు రద్దు

24
0

SOURCE :- BBC NEWS

విమానాశ్రయం

ఫొటో సోర్స్, Getty Images

27 నిమిషాలు క్రితం

చదివే సమయం: 3 నిమిషాలు

అమెరికా తూర్పు తీరాన్ని సోమవారం భారీ మంచు తుపాను ముంచెత్తింది. రికార్డు స్థాయిలో కురిసిన మంచు కారణంగా లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి.

రోడ్ ఐలాండ్, మసాచుసెట్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో సుమారు 37 అంగుళాల మంచు కురిసింది. న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్కు 19 అంగుళాలకు పైగా మంచు కురిసిందని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.

న్యూయార్క్‌లో ప్రయాణాలు చేయడం “దాదాపు అసాధ్యం”గా మారిందని ఓ ప్రభుత్వ సంస్థ హెచ్చరించింది.

తూర్పు తీరప్రాంతంలో 6 లక్షలకు పైగా ఇళ్లు, వ్యాపార సంస్థలు విద్యుత్ అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా న్యూజెర్సీ, మసాచుసెట్స్ రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

నార్త్ కరోలినా నుంచి మెయిన్ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతం వరకు ప్రభావం శీతాకాల తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. అలాగే తూర్పు కెనడాలోని కొన్ని ప్రాంతాలకు కూడా వాతావరణ హెచ్చరికలు చేశారు.

ఈశాన్య తీరప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం ఉదయం(స్థానిక కాలమానం) నాటికి 1 నుంచి 2 అడుగుల వరకు మంచు పేరుకుపోయే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
మంచు తుపాను

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో అతి చిన్న రాష్ట్రం అయిన రోడ్ ఐలాండ్‌లోనే అత్యధికంగా మంచు కురిసింది. రోడ్ ఐలాండ్ రాజధాని ప్రావిడెన్స్‌లో 33 అంగుళాల మంచు కురిసి, 1978 ఫిబ్రవరిలో నమోదైన 28.6 అంగుళాల రికార్డును అధిగమించింది.

రోడ్ ఐలాండ్‌తోపాటు పొరుగు రాష్ట్రం కనెక్టికట్‌లో అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయకుండా నిషేధం విధించారు. తరువాత మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హార్లే కూడా ప్రయాణ నిషేధాన్ని అమలు చేశారు.

“అగ్నేయ మసాచుసెట్స్‌లో అత్యవసరంకాని వాహన రాకపోకలపై నిషేధం విధిస్తున్నాం. అలాగే ప్రధాన రహదారిపై వేగ పరిమితిని గంటకు 40 మైళ్లకు (సుమారు 64 కి.మీ.) తగ్గిస్తున్నాం” అని ఆమె తెలిపారు.

“మంచు పరిస్థితులు ప్రయాణాలను అత్యంత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. మీరు ఎక్కడ ఉన్నా రహదారులపైకి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నా” అని ఆమె అన్నారు.

మసాచుసెట్స్‌లో దాదాపు 3 లక్షల మంది విద్యుత్ లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మంచు తుపాను

ఫొటో సోర్స్, Getty Images

న్యూయార్క్‌లో ప్రయాణాలపై నిషేధం

న్యూయార్క్‌లో విధించిన ప్రయాణ నిషేధం వల్ల 80 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరం దాదాపు స్తంభించిపోయింది.

కనెక్టికట్,న్యూజెర్సీ రాష్ట్రాల్లో చెట్లు, కొమ్మలు విరిగి పడటం వల్ల రహదారులపై ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, ఇంకా విద్యుత్ అంతరాయాలు పెరగవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రావిడెన్స్‌లో మంచు తొలగించే వాహనాలకు అడ్డంగా ఉన్న ఇతర 300కి పైగా వాహనాలను తరలించారని స్థానిక పత్రిక ది ప్రావిడెన్స్ జర్నల్‌ పేర్కొంది.

అయితే సోమవారం మధ్యాహ్నానికి వాహనాలను అక్కడి నుంచి తరలించే చర్యలను నిలిపివేసి, మంచులో ఇరుక్కున్న వాహనదారులకు సహాయం చేయడం ప్రారంభించారు.

వేల సంఖ్యలో విమానాల రద్దు

సోమవారం అమెరికా అంతటా 5,675కిపైగా విమానాలు రద్దయ్యాయని ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్ అవేర్ వెల్లడించింది.

న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయం నుంచి బయలుదేరే విమానాల్లో 98% రద్దయ్యాయి.

అలాగే జాన్ ఎఫ్. కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 91% విమానాలు రద్దయ్యాయి. ఈ రెండు విమానాశ్రయాల వద్ద సుమారు 15 అంగుళాల మంచు కురిసింది.

బోస్టన్‌లోని లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సిన విమానాలలో 92% రద్దయ్యాయి. న్యూవర్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో92% ఫిలడెల్ఫియా అంతర్జాతీయ విమానాశ్రయంలో 81% విమానాలు రద్దయ్యాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)