Home జాతీయ national telgu అధికార దుర్వినియోగం కేసులో ఆండ్రూ మౌంట్‌బాటన్ అరెస్ట్, సోదరుడు కింగ్ చార్లెస్ III ఏమని స్పందించారు?

అధికార దుర్వినియోగం కేసులో ఆండ్రూ మౌంట్‌బాటన్ అరెస్ట్, సోదరుడు కింగ్ చార్లెస్ III ఏమని స్పందించారు?

7
0

SOURCE :- BBC NEWS

ఆండ్రూ

ఫొటో సోర్స్, Getty Images

6 గంటలు క్రితం

చదివే సమయం: 3 నిమిషాలు

అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణల మీద బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ఆండ్రూ మౌంట్‌బాటన్-విండ్సర్‌ అరెస్టు అయ్యారు. ఈయన బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III కి స్వయానా సోదరుడు.

నార్ఫోక్‌లోని సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్ వద్ద గురువారం ఆయన్ను థేమ్స్ వ్యాలీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు ప్రస్తుతం బెర్క్‌షైర్, నార్ఫోక్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

ఆండ్రూ మౌంట్‌బాటన్-విండ్సర్ గతంలో బ్రిటన్ రాయబారిగా ఉన్న సమయంలో, అత్యంత రహస్యమైన ప్రభుత్వ సమాచారాన్ని లైంగిక కేసులలో నేరస్థుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో పంచుకున్నారనే ఆరోపణల మేరకు థేమ్స్ పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టిన తర్వాత ఈ అరెస్టు జరిగింది.

గురువారం తన 66వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ఆండ్రూ, తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ ఖండిస్తూ వస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఆండ్రూ అరెస్ట్

ఫొటో సోర్స్, BAV Media

ఆండ్రూ, కింగ్ చార్లెస్ III

ఫొటో సోర్స్, WPA Pool/Getty Images

కింగ్ చార్లెస్ III అధికారిక ప్రకటన…

ఆండ్రూ అరెస్టు తర్వాత కింగ్ చార్లెస్ III ఒక ప్రకటన విడుదల చేశారు.

”ఆండ్రూ మౌంట్‌బాటన్-విండ్సర్‌కు సంబంధించిన వార్తలు, ఆయన ప్రభుత్వ పదవిలో దుష్ప్రవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలు నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ ఆరోపణలపై పూర్తిస్థాయిలో, నిష్పక్షపాతంగా, సహేతుకమైన విధానంలో దర్యాప్తు జరుగుతోంది. సంబంధిత అధికారులు దీనిని సరైన రీతిలోనే నిర్వహిస్తారు” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

”నేను గతంలోనే చెప్పినట్లుగానే, ఈ ప్రక్రియలో ఆయన (ఆండ్రూ)కు మా సంపూర్ణ, నిస్వార్థమైన మద్దతు, సహకారం అందుతాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అని కింగ్ చార్లెస్ III స్పష్టం చేశారు.

”దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో, ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువగా నేను స్పందించడం సముచితం కాదు” అని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

ఆ స్థాయిలో అరెస్టు ఇదే తొలిసారి…

బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ఆ స్థాయి వ్యక్తిని అరెస్టు చేయడం ఇదే తొలిసారి.

జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఆండ్రూకు సంబంధాలున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే, వాటిని ఆయన ఖండిస్తూ వస్తున్నారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణల మేరకే ఆండ్రూ అరెస్టు చేశారని బీబీసీ అంచనా వేస్తోంది.

ఆండ్రూ అరెస్టుకు సంబంధించి థేమ్స్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.

“దర్యాప్తులో భాగంగా, ఈ రోజు (19/2) నార్ఫోక్ నుండి 60లలో ఉన్న వ్యక్తిని ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారనే అనుమానంతో అరెస్టు చేశాం. బెర్క్‌షైర్, నార్ఫోక్‌లోని ఆయనకు సంబంధించిన నివాసాలలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఆ వ్యక్తి ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు” అని పేర్కొంది.

ఆండ్రూ

ఫొటో సోర్స్, Reuters

ఆండ్రూ మౌంట్ బాటన్ ఎవరు?

ఆండ్రూ మౌంట్‌బాటన్ బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III కి సోదరుడు. గత సంవత్సరం, ఆయన తన ప్రిన్స్ (యువరాజు) బిరుదును కోల్పోయారు. విండ్సర్ కోటలోని రాయల్ లాడ్జ్‌ను కూడా ఆయన వదిలి వెళ్ళవలసి వచ్చింది.

దోషిగా తేలిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఆయనకున్న సంబంధంపై వారాల తరబడి జరిగిన తీవ్రమైన దర్యాప్తు తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

అప్పట్లో బకింగ్‌హామ్ ప్యాలెస్ ఒక ప్రకటన విడుదల చేసి, ఇక నుంచి ఆయన కింగ్ చార్లెస్ III సోదరుడు ఆండ్రూ మౌంట్‌బాటన్-విండ్సర్‌ అని మాత్రమే పిలవబడతారని పేర్కొంది.

తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో డ్యూక్ ఆఫ్ యార్క్‌తో సహా తన ఇతర రాజ బిరుదులను ఆండ్రూ వదులుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)