Home జాతీయ national telgu మూవీ రివ్యూ: అంచనాలు లేకుండా వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఎలా ఉంది? సంతోష్ శోభన్‌కు...

మూవీ రివ్యూ: అంచనాలు లేకుండా వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఎలా ఉంది? సంతోష్ శోభన్‌కు హిట్టిచ్చిందా?

5
0

SOURCE :- BBC NEWS

సంతోష్ శోభన్, యూవీ క్రియేషన్స్, వాలెంటైన్స్ డే, ప్రేమ

ఫొటో సోర్స్, https://www.instagram.com/santoshsoban

సంతోష్ శోభ‌న్ మంచి న‌టుడు. కానీ చాలా కాలంగా హిట్ లేదు. ప్రేమికుల దినోత్స‌వం స్పెష‌ల్‌గా క‌పుల్ ఫ్రెండ్లీ సినిమా వ‌చ్చింది. ఎలాంటి అంచ‌నాలు , బ‌జ్ లేకుండా వ‌చ్చిన ఈ సినిమా ఎలా వుంది?

క‌థ ఏమంటే శివ (సంతోష్ శోభ‌న్‌) ఇంటీరియ‌ర్ డిజైన‌ర్‌. నెల్లూరులో అవ‌కాశాలు లేక చెన్నై వెళతాడు. చిన్న రూమ్‌లో వుంటూ , డ‌బ్బుకు ఇబ్బంది ప‌డుతూ , ఖ‌ర్చుల కోసం బైక్ పూలింగ్ (రాపిడో త‌ర‌హా) చేస్తుంటాడు.

చిత్తూరుకు చెందిన మిత్ర(మాన‌స‌) హాస్ట‌ల్‌లో వుంటూ చెన్నైలో ఐటీ జాబ్ కోసం ప్ర‌య‌త్నిస్తూ వుంటుంది. ఒకానొక సంద‌ర్భంలో ఇద్ద‌రూ ప‌రిచ‌యం అవుతారు.

హాస్ట‌ల్ ఖాళీ చేసి ఊరు వెళ్లిపోవాల‌నుకున్న మిత్ర కొన్ని కార‌ణాల వ‌ల్ల ప్ర‌యాణం ర‌ద్దు చేసుకుంటుంది. మ‌ళ్లీ రూమ్ దొర‌క‌దు. శివ రూమ్‌లోనే అద్దె షేరింగ్‌తో వుండిపోతుంది.

ఈ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. శివ వైపు ఓకే. కానీ మిత్ర తండ్రి (రాజీవ్ క‌న‌కాల‌)కు ఇష్టం ఉండదు. ఈ లోగా వాళ్ల జీవితంలో హ‌ఠాత్తుగా ఒక సంఘ‌ట‌న జ‌రుగుతుంది. దానిని వాళ్లు ఎలా ఎదుర్కొన్నార‌న్నదే మిగ‌తా క‌థ‌.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

‘80 శాతం సినిమా హీరో హీరోయిన్ల మధ్యే…’

ఒకే ఇంట్లో ఇద్ద‌రు వుండ‌డం ఔను వాళ్లిద్ద‌రు ఇష్ట‌ప‌డ్డారు సినిమాని గుర్తు తెస్తుంది. 1978లో వ‌చ్చిన అమ‌ర‌ప్రేమ ఇదే క‌థ‌. క‌మ‌ల్‌హాస‌న్‌, జరీనా మ‌ధ్య కెమిస్ట్రీ పండింది. ఆ రోజుల్లో హిట్ కాదు కానీ, ల‌వ్ క్లాసిక్. తాతినేని రామారావు ద‌ర్శ‌కుడు. అలాగే గీతాంజ‌లి , వ‌సంత కోకిల సినిమాలు కూడా గుర్తుకొస్తాయి.

అంద‌రికీ తెలిసిన క‌థ‌, చూసిన క‌థ‌. అయినా సినిమా బోరు కొట్ట‌క‌పోవ‌డానికి కార‌ణం ద‌ర్శ‌కుడు అశ్విన్ చంద్ర‌శేఖ‌ర్ ప్ర‌తిభ‌, దినేష్ పురుషోత్త‌మ‌న్ కెమెరా. మంచి పాట‌లు స‌పోర్ట్ చేసి వుంటే ఇదో క్లాసిక్‌ అయి ఉండేది.

సినిమా 80 శాతం హీరోహీరోయిన్ల మ‌ధ్యే న‌డుస్తుంది. మిగిలిన పాత్ర‌లున్నా వాళ్ల ప‌రిధి త‌క్కువే. సెకండాఫ్‌లో వ‌చ్చే కుటుంబ త‌గాదా వ‌ల్ల క‌థ‌నం కొంచెం నెమ్మ‌దించింది.

సాదాసీదాగా ప్రారంభ‌మైన సినిమా , హీరోహీరోయిన్ల స్క్రీన్ ప్ర‌జెన్స్‌తో ప్రేక్ష‌కుల్ని క‌ట్టి ప‌డేస్తుంది. కెరీర్‌లో స్ట్ర‌గుల్ అయ్యే కుర్రాడుగా సంతోష్ శోభ‌న్ న‌ట‌న అద్భుతం. సాదాసీదా అమ్మాయిగా మాన‌స ఎక్స్‌ప్రెష‌న్స్ సూప‌ర్‌. ఫ‌స్టాఫ్ అంతా ఇద్ద‌రూ బైక్‌లో వెళ్లే సీన్స్ వుంటాయి. చెన్నైలోని దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి లోకేష‌న్స్‌ను కెమెరా చాలా అందంగా బంధించింది.

సంతోష్ శోభన్, యూవీ క్రియేషన్స్, వాలెంటైన్స్ డే, ప్రేమ

ఫొటో సోర్స్, https://www.instagram.com/santoshsoban

ఇద్ద‌రి మ‌ధ్య మెల్లిగా ప్రేమ‌ని ఎస్టాబ్లిష్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యారు. సెకండాఫ్‌లో స్లో నెరేష‌న్‌గా మారి రొటీన్‌గా మారుతున్న సమయంలో ట్విస్ట్ వ‌స్తుంది. అది కూడా కొత్త‌ది కాదు. ఈ ప్ర‌మాదాన్ని ఊహించే కేర‌ళ‌లో డిఫ‌రెంట్ టైమ్‌లైన్‌లో సీన్ ఓపెన్ చేసి ద‌ర్శ‌కుడు స‌స్పెన్స్ సృష్టిస్తాడు.

కూతురి క‌ష్టం చూసి చ‌లించిపోయే తండ్రిగా రాజీవ్ ఒక సీన్‌లో క‌న్నీళ్లు తెప్పిస్తాడు. యోగిబాబు కామెడీ ట్రాక్ ఓకే. మిగ‌తా న‌టుల‌కి పెద్ద ప్రాధాన్యం లేదు.

నిడివి రెండు గంట‌లే వుండ‌డం ఊర‌ట‌. ఎడిటింగ్ షార్ప్‌గా వుంది. హీరో నెల్లూరు యాస‌, హీరోయిన్ చిత్తూరు యాస బాగున్నాయి. చెన్నైలో త‌మిళ్ డైలాగ్‌లు య‌థాత‌థంగా వాడారు. స‌బ్ టైటిల్స్ లేక‌పోయినా అర్థ‌మ‌వుతాయి.

క‌మ‌ర్షియ‌ల్ హంగులేమీ లేకుండా , ఫీల్ గుడ్‌తో తీసిన సినిమా. అంచ‌నాలు పెట్టుకోక‌పోతే హాయిగా చూడొచ్చు.

సంతోష్ శోభన్, యూవీ క్రియేషన్స్, వాలెంటైన్స్ డే, ప్రేమ

ఫొటో సోర్స్, https://www.instagram.com/santoshsoban

ప్లస్సులు, మైనస్సులు..

ప్ల‌స్ పాయింట్స్ః

1.హీరో హీరోయిన్ల న‌ట‌న‌

2.కెమెరా

3.ఎడిటింగ్‌

మైన‌స్ పాయింట్స్ః

1.రొటీన్ ట్విస్ట్‌

2.సెకండాఫ్‌లో నెమ్మ‌దించిన క‌థ‌నం

3.పాట‌లు

ఫైన‌ల్‌గా చెన్నై ఫిల్ట‌ర్ కాఫీ లాంటి సినిమా.

(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)