Home జాతీయ national telgu 135 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయిన గిటారు, ఏమిటి దీని ప్రత్యేకత?

135 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయిన గిటారు, ఏమిటి దీని ప్రత్యేకత?

13
0

SOURCE :- BBC NEWS

గిల్మర్,  'బ్లాక్ స్ట్రాట్

ఫొటో సోర్స్, Neil Lupin/Redferns via Getty Images

    • రచయిత, సోఫియా ఫెర్రీరా శాంటోస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • 14 మార్చి 2026, 12:02 IST

  • చదివే సమయం: 3 నిమిషాలు

ప్రసిద్ధ గిటారిస్ట్ డేవిడ్ గిల్మోర్ ఉపయోగించిన ఒక గిటారు రికార్డుస్థాయిలో దాదాపు 135 కోట్ల రూపాయల (14.6 మిలియన్ డాలర్లు)కు అమ్ముడుపోయిందని వేలం సంస్థ క్రిస్టీ తెలిపింది. ప్రముఖ రాక్‌బ్యాండ్ పింక్ ఫ్లాయిడ్ రూపొందించిన ఆరు ఆల్బమ్స్‌లో గిల్మోర్ ఈ గిటారును ఉపయోగించారు.

ఫెండర్ స్ట్రాటోకాస్టర్ మోడల్‌ నుంచి వచ్చిన ఈ గిటారును ‘బ్లాక్ స్ట్రాట్ ’ అని పిలుస్తారు. ఈ గిటారును 1969 , 1970-1983 మధ్య కాలంలో విడుదలైన ‘ది డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్’, ‘విష్ యు వర్ హియర్’, ‘ది వాల్’ వంటి ప్రముఖ ఆల్బమ్స్‌లో గిల్మోర్ ఉపయోగించారు.

న్యూయార్క్‌లో గురువారం జరిగిన రాక్ మెమోరాబిలియా వేలంలో, 21 నిమిషాల పాటు సాగిన బిడ్డింగ్‌లో ఓ అజ్ఞాత వ్యక్తి ఈ గిటార్‌ను దక్కించుకున్నారు.

ఇదే వేలంలో బీటిల్స్ సభ్యుడు జాన్ లెనన్‌కు చెందిన పియానో సుమారు రూ. 29.6 కోట్ల (3.2 మిలియన్ డాలర్స్)కు అమ్ముడైంది. బీటిల్స్ జ్ఞాపికలలో ఒక వస్తువుకు లభించిన అత్యధిక ధర ఇదేనని భావిస్తున్నారు.

క్రిస్టీస్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ గిటార్ 2 నుంచి 4 మిలియన్ డాలర్స్ మధ్య ధర పలుకుతుందని అంచనా వేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
గిల్మర్ గిటార్, విష్ యు వర్ హియర్ టూర్‌

ఫొటో సోర్స్, Richard E. Aaron/Redferns via Getty Images

‘చరిత్ర సృష్టిస్తున్నట్లు అనిపించింది’

అమెరికన్ వ్యాపారవేత్త, కోటీశ్వరుడైన జిమ్ ఇర్సే సేకరించిన అరుదైన వస్తువులను ఈ ప్రత్యక్ష వేలంలో ఉంచారు. జిమ్ ఇర్సే 2025లో మరణించారు.

“వేలంలో ఒక్కో వస్తువు అమ్ముడవుతుంటే, మేం చరిత్ర సృష్టిస్తున్నట్లు అనిపించింది” అని క్రిస్టీస్ అమెరికాస్ ప్రెసిడెంట్ జూలియన్ ప్రాడెల్స్ అన్నారు.

గిల్మోర్ గిటార్ విక్రయం అంతకుముందున్న రికార్డును అధిగమించింది.

గతంలో ఆ రికార్డు 1993లో నిర్వాణ బ్యాండ్ షో అయిన ‘ఎంటీవీ అన్‌ప్లగ్డ్’ లో కర్ట్ కోబెన్ ఉపయోగించిన ‘1959 మార్టిన్ డీ-18ఈ’ రెట్రో అకౌస్టిక్-ఎలక్ట్రిక్ గిటార్ పేరిట ఉండేది.

కోబెన్ మరణించడానికి కేవలం ఐదు నెలల ముందు ఈ షో చేశారు.

ఆ గిటార్ 2020లో సుమారు రూ.55 కోట్లకు (6 మిలియన్ డాలర్లు) అమ్ముడైంది.

గురువారం జరిగిన వేలంలో కర్ట్ కోబెన్‌కే చెందిన మరొక గిటార్, ‘స్మెల్స్ లైక్ టీన్ స్పిరిట్’ మ్యూజిక్ వీడియోలో కనిపించే నీలిరంగు ఫెండర్ మస్టాంగ్ సుమారు రూ. 63.8 కోట్లకు (6.9 మిలియన్ డాలర్లు) అమ్ముడైంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)