SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, @narendramodi
2 గంటలు క్రితం
భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్ శుక్రవారం సమావేశమయ్యారు.
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న 6వ బిమ్స్‌టెక్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
BIMSTEC అంటే ‘బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్’.
భారత్, బంగ్లాదేశ్ మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలాకాలం తర్వాత జరిగిన ఈ ఇద్దరు నేతల భేటీ కీలకంగా మారింది.

ఆగస్టు 5, 2024న, బంగ్లాదేశ్‌లో ప్రజాతిరుగుబాటు కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం పతనమైంది. ఆ తర్వాత, షేక్ హసీనా భారతదేశంలో ఆశ్రయం పొందారు.
అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు.
ఈ విషయంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇటీవల, చైనా పర్యటనలో భారత్‌లోని ఏడు ఈశాన్య రాష్ట్రాల గురించి మొహమ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి.

ఫొటో సోర్స్, ANI
‘హిందువుల భద్రత అంశాన్ని మోదీ లేవనెత్తారు’
మొహమ్మద్ యూనస్‌తో జరిగిన సమావేశంలో బంగ్లాదేశ్‌లో హిందువులు సహా ఇతర మైనారిటీల భద్రతపై భారత్ ఆందోళనలను మోదీ ప్రస్తావించినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
ఈ సమావేశం గురించి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ, “ప్రజాస్వామ్యబద్దమైన, స్థిరమైన, శాంతియుతమైన, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు ఉంటుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు” అన్నారు.
”బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలను భారత్ కోరుకుంటోందని, రెండు దేశాల మధ్య వాతావరణాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు ఉండకూడదని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
సరిహద్దు భద్రత అంశాన్ని మోదీ లేవనెత్తారు. సరిహద్దు భద్రతను కొనసాగించేందుకు చట్టవిరుద్ధమైన చొరబాట్లను నిరోధించాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు” అని మిస్రీ తెలిపారు.

ఫొటో సోర్స్, @narendramodi
మోదీ ఎక్స్ పోస్టులో ఏమన్నారంటే..
బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీల భద్రత అంశాన్ని లేవనెత్తినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
“బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్‌తో సమావేశం జరిగింది. బంగ్లాదేశ్‌తో నిర్మాణాత్మక, ప్రజాస్వామ్యయుత సంబంధాలకు భారత్ కట్టుబడి ఉంది” అని ప్రధాని మోదీ పోస్ట్ చేశారు.
”బంగ్లాదేశ్‌లో శాంతియుతమైన, స్థిరమైన, సమ్మిళిత, ప్రజాస్వామ్యానికి భారత్ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించాం. అక్రమ చొరబాట్లను నిరోధించే చర్యలపై చర్చించాం. హిందువులు, ఇతర మైనారిటీల భద్రత, శ్రేయస్సుపై మనకున్న తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేశాం” అని ఎక్స్ పోస్ట్‌లో రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
షేక్ హసీనా అప్పగింత గురించి ప్రశ్న..
ప్రధాని మోదీ థాయిలాండ్ పర్యటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మీడియా సమావేశంలో షేక్ హసీనా విషయంపై విదేశాంగ కార్యదర్శి మాట్లాడారు. సమావేశంలో ఎదురైన ఒక ప్రశ్నకు మిస్రీ సమాధానమిస్తూ, షేక్ హసీనాకు సంబంధించి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నుంచి ఒక అభ్యర్థన వచ్చినట్లు చెప్పారు.
అయితే, ఈ విషయంపై అంతకుమించి వివరాలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు.
షేక్ హసీనా అప్పగింతపై అధికారిక అభ్యర్థన గురించి విక్రమ్ మిస్రీని అడిగారు.
దీనిపై విక్రమ్ మిస్రీ బదులిస్తూ, “షేక్ హసీనాకు సంబంధించి బంగ్లాదేశ్ నుంచి మాకు ఒక అభ్యర్థన వచ్చింది. మా ప్రతినిధి ఇప్పటికే దాని గురించి చెప్పారు. ప్రస్తుతానికి, ఈ అంశంలో ఇంతకుమించి వివరాలు వెల్లడించడం సరికాదు” అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)