Home జాతీయ national telgu భారత్ మళ్లీ రఫేల్ యుద్ధ విమానాల్ని ఎందుకు కొంటోంది?

భారత్ మళ్లీ రఫేల్ యుద్ధ విమానాల్ని ఎందుకు కొంటోంది?

7
0

SOURCE :- BBC NEWS

రఫేల్

ఫొటో సోర్స్, Getty Images

సైన్యాన్ని బలోపేతం చేసేందుకు రూ. 3.6 లక్షల కోట్లతో రక్షణ కొనుగోళ్ల ప్రతిపాదనలకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇందులో ఎయిర్‌ఫోర్స్ కోసం 114 డసాల్ట్ రఫేల్ ఫైటర్ యుద్ధ విమానాలు, నేవీ కోసం బోయింగ్‌ సంస్థ నుంచి పీ-81 నెప్ట్యూన్ నిఘా విమానాలు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.

పాకిస్తాన్ సహా పొరుగు దేశాలతో ఉద్రిక్తతల దృష్ట్యా సైన్యాన్ని ఆధునీకరించే కార్యక్రమాన్ని వేగవంతం చేయడంపై ఒత్తిడి పెరుగుతోంది.

ఈ ఏడాది బడ్జెట్‌లో రక్షణ రంగ కేటాయింపులు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడవి కార్యరూపం దాలుస్తున్నాయి.

భారత రక్షణ బడ్జెట్ 15శాతం పెరిగి రూ. 7.69 లక్షల కోట్లకు చేరుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ స్క్వాడ్రన్ల సంఖ్య 29కి తగ్గింది. ఎయిర్‌ఫోర్స్‌కు నమ్మకమైన విమానంగా ఉన్న మిగ్-21లను గతేడాది సెప్టెంబర్‌లో సర్వీసుల నుంచి తొలగించారు.

మిగ్-29, ఆంగ్లో-ఫ్రెంచ్ జాగ్వార్ ఎయిర్‌క్రాఫ్ట్, డసాల్ట్ సంస్థకు చెందిన మిరేజ్ 2000 విమానాలను కూడా రానున్న కొన్నేళ్లలో ఎయిర్‌ఫోర్స్ సేవల నుంచి తప్పించనున్నారు.

సైన్యానికి అవసరమైన ఆయుధాలు, మెషినరీ కోసం భారత్ చాలాకాలంగా విదేశాల మీద ఆధారపడుతోంది. అయితే కొన్నేళ్లుగా దేశీయ తయారీకి ప్రాధాన్యత పెరుగుతోంది.

అందుకే 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం చాలా ముఖ్యమైన ఒప్పందంగా మారింది. దీని వల్ల ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తక్షణ అవసరాలు తీరతాయి.

రఫేల్ యుద్ధ విమానం, భారత్ ప్రాన్స్ ఒప్పందం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ

ఫొటో సోర్స్, European Photopress Agency

ఈ ఒప్పందం ఎందుకంత ముఖ్యం?

దేశ ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో దేశ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ ఒప్పందం భారత సైన్యపు సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని మీడియా కథనాలు చెబుతున్నాయి.

“తొలిసారిగా రఫేల్ యుద్ధ విమానం ఫ్రాన్స్ బయట స్థానికంగా భారీ స్థాయిలో తయారు చేస్తున్నారు. ఇందులో స్థానికంగా 40 నుంచి 50 శాతం తయారీ ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్- ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ వెలుపల తయారు చేస్తున్నారు. ఇందులో మధ్యవర్తులు ఎవరూ లేరు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతోంది” అంటూ రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం లభించిన తర్వాత భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ వ్యాఖ్యానించారు.

ఈ ఒప్పందంతో రఫేల్ యుద్ధ విమానాలను త్వరగా సైన్యంలో చేర్చడానికి వీలవుతుందని రక్షణ శాఖ కార్యదర్శి చెప్పారు.

“నౌకాదళం ఉపయోగించే రఫేల్ విమానాల సరఫరా 2028లో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు అంటే ఇప్పటి నుంచి మూడున్నరేళ్ల తర్వాత ఎయిర్‌ఫోర్స్‌కు అవసరమైన రఫేల్ విమానాల రాక కూడా మొదలవుతుంది” అని ఆయన అన్నారు.

ఈ ఒప్పందం కింద ఆమోదించిన ఫ్రేమ్‌వర్క్ ప్రకారం 114 రఫేల్ యుద్ధ విమానాల్లో 18 నేరుగా ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుకుంటాయి. మిగతా 90కి పైగా విమానాలను మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద భారత్‌లోనే తయారు చేస్తారు.

రఫేల్ యుద్ధ విమానం, భారత్ ప్రాన్స్ ఒప్పందం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP via Getty Images

ఫ్రాన్స్‌తో చేసుకున్న కొత్త ఒప్పందంతో భారత్‌కి మొత్తం 176 రఫేల్ యుద్ధ విమానాలు ఉంటాయి. వాటిలో 36 ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేస్తున్నాయి. అదనంగా ఇండియన్ నేవీ 26 మెరైన్ జెట్ విమానాల కోసం ఆర్డర్ చేసింది.

ఈ ఒప్పందం పట్ల సానుకూలత వ్యక్తం చేసిన రక్షణ రంగ నిపుణుడు రాహుల్ బేదీ ఇదేమీ కొత్తది కాదన్నారు.

“126 ఫైటర్ జెట్లను కొనేందుకు 2007-08 మధ్య డసాల్ట్ సంస్థతో చర్చలు మొదలయ్యాయి. ఆ సమయంలో దీనిని మీడియం మల్టీ రోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ అని పిలిచేవారు” అని ఆయన చెప్పారు.

“126 ఫైటర్ జెట్లను తయారు చేయాల్సి ఉంది. అందులో 18 నేరుగా వచ్చేశాయి. మిగిలిన 108 యుద్ధ విమానాలను హిందూస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ తయారు చేయనుంది.

ఆ సమయంలో ఈ ఒప్పందం కోసం ఆరు విమానాలు కొనుగోలు చేశారు. వాటిలో రఫేల్‌ను ఎంపిక చేశారు. 2011-2012లో హెచ్ఏఎల్, డసాల్ట్ మధ్య చర్చలు మొదలయ్యాయి. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది” అని ఆయన అన్నారు.

“బీజేపీ ప్రభుత్వం 2015-16లో ఈ ఒప్పందాన్ని రద్దు చేసి నేరుగా 36 రఫేల్ యుద్ధ విమానాలను దిగుమతి చేసుకుంది. 114 రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు అనుమతి ఇవ్వడం, ఒక విధంగా చెప్పాలంటే పాత ఒప్పందాన్ని పునరుద్ధరించడమే” అని రాహుల్ బేదీ వివరించారు.

రఫేల్ యుద్ధ విమానం, భారత్ ప్రాన్స్ ఒప్పందం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ

ఫొటో సోర్స్, ANI

భారత్ రఫేల్ జెట్ ఫైటర్ల మీద ఎందుకు ఆధారపడుతోంది?

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఫిబ్రవరి17 నుంచి 19 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. అంతకు ముందే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం లభించింది.

ఐఎన్ఎస్‌ విక్రాంత్, ఐఎన్ఎస్‌ విక్రమాదిత్య మీద మోహరించేందుకు భారత్ 26 రఫేల్ మెరైన్ ట్విన్, సింగిల్ సీట్ జెట్లను ఆర్డర్ చేసింది.

గతేడాది భారత్- పాక్ మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు రఫేల్ వార్తల్లో నిలిచింది.

భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. అయితే భారత్ దీనిని అంగీకరించలేదు.

పాకిస్తాన్ వద్ద ఉన్న చైనాకు చెందిన జె-10 యుద్ధ విమానాలు రఫేల్ కంటే మెరుగ్గా ఉన్నాయని అప్పట్లో కథనాలు వచ్చాయి. అయితే ఈ ఘర్షణలో తమ యుద్ధ విమానాలు దెబ్బ తిన్నాయా లేదా అనేది భారత్ ఇప్పటికీ స్పష్టం చేయలేదు.

“యుద్ధ విమానాలను మనమే తయారు చేసుకుని ఉంటే బావుండేది. రఫేల్ ఫర్వాలేదు. అమెరికా నుంచి ఎఫ్-35 కొంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రఫేల్ డీల్ మాత్రమే ఖరారైంది. ఆధునిక యుద్ధ విమానాలకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఉంటాయి. అమెరికా టెక్నాలజీ అందించకుండా ఆంక్షలు విధిస్తే పరిస్థితేంటి?” అని ఆర్గనైజేషన్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో రక్షణ నిపుణుడు మనోజ్ జోషి అన్నారు.

రఫేల్ మీద ఆధారపడటాన్ని రాహుల్ బేదీ సమర్థిస్తున్నారు.

“రఫేల్‌ను గతంలో మరో ఫైటర్‌ జెట్‌కు పోటీగా ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు వాటిని నేరుగా కొనడమే సమస్య. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 29 ఫైటర్ స్క్వాడ్రన్లు ఉన్నాయి. వాస్తవానికి ఇవి 42 ఉండాలి. ఈ 29 స్క్వాడ్రన్లలో 8 నుంచి10 స్క్వాడ్రన్లు పదవీ విరమణకు దగ్గరగా ఉన్నాయి. 197- 80లలో ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన జాగ్వార్ విమానాల స్క్వాడ్రన్లు 6 ఉన్నాయి. జాగ్వార్‌ను ఉపయోగిస్తున్నది భారత వైమానిక దళం మాత్రమే” అని రాహుల్ బేదీ.

మిరాజ్-2000 ఇటీవలే అప్‌గ్రేడ్ అయింది. అయినప్పటికీ అది ఐదారేళ్ల కంటే ఎక్కువ కాలం ఉండదని ఆయన వివరించారు. రష్యన్ మిగ్-29 కూడా అప్‌గ్రేడ్ అయింది, కానీ దాని ఆపరేషనల్ లైఫ్ ఐదు నుంచి ఏడేళ్లకే పరిమితం అయింది.

“తేలికపాటి యుద్ధ విమానం తేజస్ వంటి స్వదేశీ జెట్‌ల విషయంలోనూ తరచూ ఆలస్యం అవుతోంది. తేజస్ కార్యక్రమం 1981 నుంచి కొనసాగుతోంది. 45ఏళ్లలో తేజస్ స్క్వాడ్రన్లు కేవలం రెండు మాత్రమే సిద్ధమయ్యాయి. మూడోది ఇప్పుడు సిద్ధంగా ఉంది. కానీ దానిని చేర్చుకోవడానికి సమయం పడుతుంది. మొత్తంమీద వైమానిక దళానికి వీలైనంత త్వరగా 42 స్క్వాడ్రన్‌లు అవసరం. మన దగ్గర ఇప్పటికే రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నందున చాలా ఖర్చులు తగ్గుతాయి” అని రాహుల్ బేదీ చెప్పారు.

రఫేల్ యుద్ధ విమానం, భారత్ ప్రాన్స్ ఒప్పందం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ

ఫొటో సోర్స్, ARUN SANKARAFP via Getty Images

రఫేల్ సుదీర్ఘ ప్రయాణం

1999లో కార్గిల్ యుద్ధం తర్వాత వీలైనంత త్వరగా మరిన్ని ఆధునిక యుద్ధ విమానాలను అందించాలని భారత వైమానిక దళం కోరింది.

ఆ సమయంలో ఫ్రాన్స్‌కు చెందిన మిరాజ్-2000 భారత వైమానిక దళంలో అత్యంత విశ్వసనీయమైన యుద్ధ విమానంగా ఉంది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు అవసరమైన లక్షణాలు ఈ విమానానికి ఉన్నాయి. కచ్చితమైన దాడి సామర్థ్యం, అన్ని వాతావరణాల్లోనూ పని చేసే శక్తి, విజువల్ రేంజ్‌కి మించి దాడి చేయగల కెపాసిటీ ఈ విమానానికి ఉంది. మిరాజ్‌ 2000ను రఫేల్‌ను తయారు చేసే డసాల్ట్ సంస్థ రూపొందించింది

మిరాజ్-2000 రష్యాకు చెందిన Su-20MKI స్క్వాడ్రన్ల కంటే తేలికైనది. దీన్ని గ్రహించిన డసాల్ట్ సంస్థ పూర్తి అసెంబ్లీ లైన్ బదిలీతో పాటు అప్‌గ్రేడ్ చేసిన విమానాన్ని భారతదేశానికి అందించింది.

2010లో యూపీఏ ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించింది. 2012 వరకు దీనికి సంబంధించిన చర్చలు కొనసాగాయి.

2014లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. 2016లో సుమారు రూ. 59వేల కోట్లతో ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ జెట్ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది.

“కొన్ని ఆర్థిక అంశాలు మినహా, రక్షణ సహకారంతో పాటు 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇది సంతోషకరం” అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016లో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)