SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Ishara S. KODIKARA/AFP via Getty Images
4 గంటలు క్రితం
చదివే సమయం: 3 నిమిషాలు
ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో ఓడించి జింబాబ్వే సంచలనం సృష్టించింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు, 19.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది.
జింబాబ్వే అపూర్వ విజయంలో కీలకపాత్ర పోషించి వార్తల్లో నిలిచాడు బ్లెసింగ్ ముజర్బానీ.
ఈ 29 ఏళ్ల బౌలర్ తన విన్నింగ్ స్పెల్‌తో జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి, నలుగురు ఆస్ట్రేలియన్ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపాడు.

బ్లెసింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన అనుభవముంది. 2018లో అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేశాడు.
ఇప్పటి వరకూ ఆడిన 85 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో మొత్తం 100 వికెట్లు పడగొట్టాడు.
కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పేరుతెచ్చుకున్న బ్లెసింగ్.. ఇప్పటి వరకూ 7.14 ఎకానమీతో పరుగులిచ్చాడు.
ఫొటో సోర్స్, Robert Cianflone/Getty Images
అంతర్జాతీయ టీ20లలో, 21 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసినప్పుడు అతని ఎత్తు గురించి చాలా చర్చ జరిగింది.
బ్లెసింగ్ ఎత్తు 6 అడుగుల 8 అంగుళాలు. సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నే మోర్కెల్ కంటే ఎత్తు.
టీ20తో పాటు, గత ఏడాది టెస్ట్ క్రికెట్‌లో కూడా ముజర్బానీ రాణించాడు.
2025లో, టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. పది టెస్టుల్లో 42 వికెట్లు పడగొట్టాడు.
ఇటీవల కాలంలో, 58 పరుగులిచ్చి 7 వికెట్లు తీయడం కెరీర్ బెస్ట్‌గా నిలిచింది.
2021లో, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టు తరపున ఆడిన బ్లెసింగ్.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఆ తర్వాత, 2022లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అతన్ని నెట్ బౌలర్‌గా ఎంపిక చేసింది. అయితే, ఇంకా ఐపీఎల్‌లో ఆడే అవకాశం రాలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



