SOURCE :- BBC NEWS
నిప్పులు కక్కుతూ .. నింగి నుంచి నేల మీదకు
21 మార్చి 2026, 11:13 IST
అమెరికాలోని ఓహియో పెన్సిల్వేనియా రాష్ట్రాల మీదుగా ప్రయాణించిన ఓ ఉల్క క్లీవ్‌లాండ్ సమీపంలో కూలిపోయింది.
సుమారు ఏడు టన్నుల బరువు, రెండు మీటర్ల వ్యాసం కలిగిన ఒక పెద్ద గ్రహశకలం ఓహియో సమీపంలో భూవాతావరణంలోకి ప్రవేశించి, క్లీవ్‌ల్యాండ్ ప్రాంతంలో అగ్నిగోళంలా కనిపించింది.
ఈ ఉల్క భూమిని తాకకముందే వాతావరణంలోనే మండిపోయినప్పటికీ, దాని పరిమాణం కారణంగా ఆందోళన కలిగించింది.
అంతరిక్షం నుంచి రాలిన ఒక అరుదైన, భారీ ఉల్కగా దీనిని పరిగణిస్తున్నారు.
ఉల్క పడినప్పుడు లోరైన్ కౌంటీలోని సీస్మోగ్రాఫ్‌లలో వైమానిక పేలుడు వల్ల కలిగే స్థాయిలో షాక్ వేవ్స్ నమోదయ్యయి.
ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



