Home జాతీయ national telgu ట్రంప్ టారిఫ్స్ అమలయ్యేది ఎప్పటి నుంచి?

ట్రంప్ టారిఫ్స్ అమలయ్యేది ఎప్పటి నుంచి?

5
0

SOURCE :- BBC NEWS

ట్రంప్, సుంకాలు, సెన్సెక్స్, ఫార్మా

ఫొటో సోర్స్, Reuters

9 గంటలు క్రితం

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్‌ను విధించిన 100 దేశాల జాబితాను శ్వేతసౌధం విడుదల చేసింది. దీని ప్రభావం ఆయా దేశాలలోని స్టాక్ మార్కెట్లపై పడింది. భారత్‌పై కూడా అమెరికా 26 శాతం టారిఫ్‌ను విధించింది.

భారత్‌పై 26శాతం సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.

బుధవారం 76,617.44 పాయింట్ల దగ్గర ముగిసిన సెన్సెక్స్ గురువారం 75,811.86 పాయింట్ల దగ్గర నష్టాలతో మొదలయింది ఐటీ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా, ఫార్మా రంగ షేర్లు లాభపడ్డాయని మనీకంట్రోల్ తెలిపింది

తమపై భారత్ 52 శాతం సుంకం విధిస్తోందని, కానీ తాము 26 శాతం డిస్కౌంట్ సుంకం విధిస్తున్నామని అమెరికా తెలిపింది.

సుంకాలు ప్రకటించే సమయంలో ట్రంప్ భారత్ ప్రస్తావన చేశారు.

కొద్ది రోజుల క్రితమే ప్రధాని మోదీ అమెరికా పర్యటన చేసి వెళ్లారని, ఆయన తనకు మంచి మిత్రుడని, కానీ మీరు నా మిత్రుడని, కానీ మీరు మాతో సరిగా వ్యవహరించడం లేదని చెప్పానని ఆయన అన్నారు.

‘మా నుంచి 52 శాతం వసూలు చేస్తున్నారు. మీకు అర్థమైందా… కానీ మేం ఆ స్థాయిలో వసూలు చేయడం లేదు. దశాబ్దాలుగా’ అని ట్రంప్ పేర్కొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఎప్పటి నుంచి అమల్లోకి..

విదేశాల్లో తయారయ్యే అన్ని ఆటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధించారు. ఇది అమెరికా కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 12:01 గంటల నుంచి అమల్లోకి వచ్చింది.

అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 5వ తేదీ అర్ధరాత్రి 12.01 గంటల నుంచి 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ అమల్లోకి వస్తుంది.

అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 9వ తేదీ అర్ధరాత్రి 12:01 గంటల నుంచి 10 శాతానికి పైగా టారిఫ్‌లు అమల్లోకి వస్తాయి.

ట్రంప్, సుంకాలు, సెన్సెక్స్, ఫార్మా

ఫొటో సోర్స్, Reuters

స్టాక్‌మార్కెట్‌పై ప్రభావం

భారత్‌పై విధించే రెసిప్రోకల్ టారిఫ్స్ నుంచి ఫార్మా ఉత్పత్తులను ట్రంప్ మినహాయించడంతో ఫార్మారంగం షేర్లు 5శాతం పెరిగాయని రాయిటర్స్ తెలిపింది. భారతీయ ఔషధ ఉత్పత్తుల్లో మూడోవంతు అమెరికా దిగుమతి చేసుకుంటుంది.

ట్రంప్ సుంకాల నిర్ణయంపై అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. ట్రంప్ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారితీస్తుందన్న ఆందోళన నెలకొంది. ఆసియాలో భారత్ సహా కీలక దేశాల స్టాక్ మార్కెట్లు నష్టాల్లో సాగుతున్నాయి.

చైనా, టోక్యో, దక్షిణ కొరియా మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి.

మరోపక్క ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం బంగారంపైనా పడింది. బంగారం ధరలు రికార్డు హైకి చేరాయి.

ట్రంప్, సుంకాలు, సెన్సెక్స్, ఫార్మా

ఫొటో సోర్స్, European Commission

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఎవరెవరు ఏమన్నారు?

ట్రంప్ టారిఫ్‌లను పలు దేశాల అధినేతలు తప్పుపట్టారు. ఇది అన్యాయమైనవిగా అభివర్ణించారు.

కొత్త సుంకాలు విధించాలన్న ట్రంప్ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వండర్ లెయన్ విమర్శించారు.

యూరోపియన్ యూనియన్‌పై 20శాతం సుంకం విధించడం తప్పుడు నిర్ణయమని ఇటలీ అధ్యక్షురాలు జార్జియా మెలోని అన్నారు. ఇవి ఇటు యూరోపియన్ యూనియన్‌కు గానీ, అటు అమెరికాకు గానీ లాభం కలిగించబోవని, వాణిజ్య యుద్ధాన్ని నివారించడానికి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తామన్నారు.

ఆస్ట్రేలియా వస్తువులపై 10శాతం సుంకం విధించడం అన్యాయమైన చర్య అని ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఆంథోని అల్బనీస్ తెలిపారు.

అమెరికా విధించిన 17శాతం సుంకాలు పూర్తిగా షాక్‌కు గురిచేశాయని ఇజ్రాయెల్ స్పందించింది.

అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం వాస్తవ రూపం దాలుస్తోందని, వాణిజ్య సంక్షోభాన్ని అధిగమించడానికి మార్గాలు పరిశీలిస్తున్నామని దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. దక్షిణకొరియాపై ట్రంప్ 25శాతం సుంకాలు విధించారు.

ట్రంప్ సుంకాలపై జపాన్ తీవ్రంగా స్పందించింది. జపాన్‌పై 24శాతం సుంకాలు విధించడం విచారకరమని, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాన్ని, జపాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను అమెరికా ఉల్లంఘించిందని జపాన్ ఆరోపించింది.

36శాతం సుంకాలపై స్పందించిన థాయ్‌లాండ్ తాము అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది.

చైనా, జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రతిచర్యలుంటాయన్న చైనా

చైనాపై అమెరికా 34శాతం సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. సుంకాలు వెంటనే ఎత్తేయాలని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అమెరికాను కోరింది. తమ హక్కులను, ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రతిచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

సుంకాల పెంపు వల్ల అమెరికా సమస్యలు పరిష్కారం కావని చరిత్ర నిరూపించిందని, ఇది అమెరికా ప్రయోజనాలకు హాని కలిగించడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వృద్ధికి, పారిశ్రామిక స్థిరత్వానికి ప్రమాదకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేసింది.

అమెరికా తనను తాను ఓడించుకునే టిట్ ఫర్ టాట్ గేమ్‌గా చైనా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ జిన్హువా సుంకాల తీరును అభివర్ణించింది. ట్రంప్ నిర్ణయాన్ని సుంకాల బ్లాక్ ‌మెయిల్‌గా గ్లోబల్ టైమ్స్ అభిప్రాయపడింది.

టారిఫ్‌ల జాబితాలో తైవాన్‌ను ప్రత్యేక దేశంగా పేర్కొనడాన్ని చైనా ప్రతినిధి అమెరికా దృష్టికి తీసుకెళ్లారు.

ట్రంప్ టారిఫ్‌లు పూర్తి అసమంజసంగా ఉన్నాయని తైవాన్ స్పందించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)