Home జాతీయ national telgu ట్రంప్ టారిఫ్‌లు: దేనికి మినహాయింపు, దేనిపై వడ్డింపు?

ట్రంప్ టారిఫ్‌లు: దేనికి మినహాయింపు, దేనిపై వడ్డింపు?

5
0

SOURCE :- BBC NEWS

ట్రంప్,  సుంకాలు, ఫార్మా, వజ్రాలు

ఫొటో సోర్స్, Getty Images

6 గంటలు క్రితం

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నాయకులు ఆయన్ను విమర్శిస్తున్నారు.

ఆటోమొబైల్స్‌పై ట్రంప్ 25 శాతం టారిఫ్ విధించారు. ఇకనుంచి అమెరికాకు వాహనాలను ఎగుమతి చేసే ఏ దేశమైనా 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది.

వీటితోపాటు కొన్ని ఉత్పత్తులపై భారీగా సుంకాలు చెల్లించాల్సిఉంది.

అయితే, ట్రంప్ సుంకాల నుంచి తప్పించిన రంగాలు కూడా కొన్ని ఉన్నాయి.

ట్రంప్ కొన్ని ఉత్పత్తులను సుంకాల నుంచి మినహాయించారు. ప్రధానంగా సాధారణ వినియోగం, వ్యూహాత్మక అవసరాలకు సంబంధించిన ఉత్పత్తులను మినహాయించారు.

ఈ మినహాయింపులతో భారత్ ప్రయోజనం పొందనుంది.

ముఖ్యంగా ఫార్మా పరిశ్రమను సుంకాల నుంచి మినహాయించింది.

ఈ మేరకు వైట్‌హౌస్ ఈ మినహాయింపుల జాబితా విడుదల చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఔషధ ఉత్పత్తులు

భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి చేసే జనరిక్ ఔషధాలను టారిఫ్‌ల నుంచి మినహాయించారు.

భారత్ జనరిక్ ఔషధ పరిశ్రమ అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంది.

ఫార్మా ఉత్పత్తులపై టారిఫ్‌లు విధిస్తే భారతీయ కంపెనీలకు నష్టం వాటిల్లుతుందనే భయాలు ట్రంప్ ప్రకటనకు ముందు వ్యక్తమయ్యాయి.

భారత్ ఏటా $12.7 బిలియన్ల(సుమారు రూ. లక్ష 8 వేల కోట్ల) విలువైన మందులను అమెరికాకు ఎగుమతి చేస్తుంది. భారత్ నుంచి ఎగుమతయ్యే మందులపై అమెరికాలో ఎలాంటి పన్ను ఉండదు.

అయితే, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే మందులపై భారత్ 10.91 శాతం టారిఫ్ విధిస్తుంది.

దీంతో ఈ రంగంలో ఇక్కడ 10.91 శాతం వాణిజ్య లోటు ఉంది.

ట్రంప్ సుంకాల నుంచి కొన్ని నిర్దిష్ట ఔషధాలను మినహాయించారు.

ఇన్సులిన్, విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి5, విటమిన్ బి6, విటమిన్ బి12, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్, నియాసిన్‌కు సంబంధించిన మందులు ఈ మినహాయింపు జాబితాలో ఉన్నాయి.

ట్రంప్,  సుంకాలు, ఫార్మా, వజ్రాలు

ఫొటో సోర్స్, Getty Images

రాగికి మినహాయింపు

విదేశాల నుంచి అమెరికాకు వచ్చే రాగిని కూడా సుంకాల పరిధి నుంచి దూరంగా ఉంచారు. అమెరికాలో అనేక పరిశ్రమల్లో రాగిని ఉపయోగిస్తారు.

రాగి దిగుమతిపై మినహాయింపుతో అమెరికాలో పారిశ్రామిక అవసరాలకు సరఫరాపై ఎలాంటి ప్రభావం పడబోదు.

ట్రంప్,  సుంకాలు, ఫార్మా, వజ్రాలు

ఫొటో సోర్స్, Getty Images

సెమీకండక్టర్లు

ఎలక్ట్రానిక్స్ తయారీకి కీలకమైన సెమీకండక్టర్ ఎగుమతులపైనా సుంకాలు లేవు.

భారతదేశం అమెరికాకు $1.68 బిలియన్ల (సుమారు రూ. 14 వేల కోట్ల) విలువైన సెమీకండక్టర్లను విక్రయిస్తుంది.

ప్రపంచ మార్కెట్లో ఈ రంగంలో భారత్‌కు పెద్దగా ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ ఈ మినహాయింపుల వల్ల భారతీయ కంపెనీలు ప్రయోజనం పొందనున్నాయి.

ఫోటోసెన్సిటివ్ సెమీకండక్టర్ పరికరాలు, ట్రాన్సిస్టర్లు, ఫోటోసెన్సిటివ్ ట్రాన్స్‌డ్యూసర్లు, సెమీకండక్టర్ పరికరాలు, ఎల్‌ఈడీ వంటి ఉత్పత్తులను సుంకాల నుంచి ట్రంప్ మినహాయింపు ఇచ్చారు.

ట్రంప్,  సుంకాలు, ఫార్మా, వజ్రాలు

ఫొటో సోర్స్, JON TILLOTT

చెక్క ఉపకరణాలు, ఎనర్జీ ఉత్పత్తులు

కలప, కలప సంబంధిత ఉత్పత్తులకు సుంకాల జాబితా నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఇంధన ఉత్పత్తిలో కీలకమైన కొన్ని ఖనిజాలను దిగుమతి సుంకాల నుంచి ట్రంప్ తప్పించారు.

కొన్ని ఖనిజాలపై సుంకాలు లేవు

అమెరికాలో అందుబాటులో లేని కొన్ని ఖనిజాలను కూడా సుంకాల మినహాయించారు. వాణిజ్య పరిమితులను బ్యాలన్స్ చేయడం లక్ష్యంగా ఈ మినహాయింపులు ఇచ్చారు.

టారిఫ్‌లు విధించని ఖనిజాలలో జింక్, ప్లాటినం, పల్లేడియం, రోడియం ఉన్నాయి.

ట్రాన్సిస్టర్లు, పేపర్‌బోర్డ్, ప్రింటెడ్ పుస్తకాలు, ప్రింటెడ్ డిక్షనరీలు, డ్రాయింగ్‌లు, వార్తా పత్రాలు మరియు జర్నల్స్ వంటి ఉత్పత్తులకూ టారిఫ్‌ల నుంచి మినహాయింపులు దక్కాయి.

మ్యాప్‌లు, ప్రింటెడ్ చార్ట్‌లు, హైడ్రోగ్రాఫిక్స్, ప్రింట్ అడ్వర్టైజింగ్ ఉత్పత్తులను కూడా సుంకం నుంచి మినహాయించారు.

ట్రంప్,  సుంకాలు, ఫార్మా, వజ్రాలు

ఫొటో సోర్స్, Getty Images

ఏఏ ఉత్పత్తులపై సుంకాలు

వజ్రాలు, ఆభరణాలు

భారత వజ్రాల పరిశ్రమ నుంచి ఎక్కువ ఎగుమతులు జరిగేది అమెరికాకే.

ట్రంప్ వజ్రాలు, ఆభరణాల దిగుమతిపై సుంకాలను ప్రకటించడం, కచ్చితంగా భారత వజ్రాల పరిశ్రమపై ప్రభావం చూపుతుంది.

కార్లు, కార్ల ఉపకరణాలు

అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కార్లపై భారత్ సుంకాలను విధిస్తుంది. ఇప్పుడు ట్రంప్ భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే కార్లు, వాటి ఉపకరణాలపై సుంకాలను ప్రకటించారు.

గతంలోనే ట్రంప్ అమెరికన్ కార్లపై సుంకాల అంశాన్ని లేవనెత్తారు.

”భారత్‌కు ఎగుమతయ్యే అమెరికన్ కార్లపై 70% సుంకం ఉంది. దీంతో ఆ కార్లను అమ్మడం దాదాపు అసాధ్యంగా మారింది” అని ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ ఆరోపించారు.

ట్రంప్,  సుంకాలు, ఫార్మా, వజ్రాలు

ఫొటో సోర్స్, Getty Images

శుద్ధి చేసిన చమురు

2023లో భారత్‌కు అమెరికా చేసిన ఎగుమతుల్లో ప్రధానమైన వాటిలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులున్నాయి. ముడి చమురు,పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 14 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

రెడీమేడ్ దుస్తులు

అమెరికా నుంచి దిగుమతయ్యే దుస్తులపై భారత్ 24.8 శాతం సుంకాన్ని విధిస్తుంది.

భారత్ కూడా అమెరికాకు 4.93 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 42 వేల కోట్ల) విలువైన వస్త్రాలను ఎగుమతి చేస్తుంది.

దానిపై సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు.

ప్రసార/టెలికాం ఉపకరణాలు

భారతదేశంలో టెలికం పరికరాల ఉత్పత్తి ప్రస్తుతం రూ. 50 వేల కోట్ల స్థాయిని దాటింది. ఇందులో దాదాపు 10,500కోట్ల రూపాయల విలువైన ఎగుమతులున్నాయి.

భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ పరిశ్రమ ద్వారా 17,800లకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించాయి.

ఈ ఉద్యోగాలపై సుంకాల ప్రభావం పడనుంది.

భారతీయ టెలికాం పరికరాలు పెద్ద మొత్తంలో అమెరికాకు చేరుతున్నాయి. 2024 సంవత్సరంలో, $6.5 బిలియన్ల (రూ. 55 వేల కోట్ల) విలువైన పరికరాలు అమెరికాకు ఎగమతయ్యాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)