SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
4 గంటలు క్రితం
చదివే సమయం: 5 నిమిషాలు
భారత్ నిర్దేశించిన 256 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజీలాండ్ తడబడింది. వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.
15 ఓవర్లు ముగిసేప్పటికి 6 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది న్యూజీలాండ్.
అనంతరం 16వ ఓవర్‌లో బుమ్రా మరో రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో 141 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది న్యూజీలాండ్ జట్టు.
ఫొటో సోర్స్, Getty Images
మూడో ఓవర్ నుంచి న్యూజీలాండ్ వికెట్లు పడడం మొదలైంది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన ఫిన్ అలెన్ లాంగాన్ వద్ద తిలక్ వర్మకు క్యాచ్‌గా దొరికిపోయాడు.
ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు పడుతూ వచ్చాయి.
బుమ్రా వేసిన నాలుగో ఓవర్ తొలిబంతికే రచిన్ రవీంద్ర ఔటయ్యాడు. ఇషాన్ కిషన్ పట్టిన క్యాచ్‌తో పెవిలియన్ బాటపట్టాడు.
అనంతరం మళ్లీ బాల్ తీసుకున్న అక్షర్ పటేల్, 5వ ఓవర్ ఐదో బంతికి ఫిలిప్స్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు.
తర్వాత వచ్చిన చాప్‌మన్ 3 పరుగులకే పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఫొటో సోర్స్, Getty Images
వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన సెయిఫెర్ట్.. ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. దీంతో న్యూజీలాండ్ 76 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
అనంతరం అక్షర్ పటేల్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్, బుమ్రా బౌలింగ్‌లో నీషమ్, హెన్రీ ఔటయ్యారు.
దీంతో 141 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.
భారీ స్కోర్ ఛేదించే క్రమంలో న్యూజీలాండ్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. ఒక్క సెయిఫెర్ట్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.
అర్ష్‌దీవ్ వేసిన తొలి ఓవర్‌లో అలెన్ ఇచ్చిన క్యాచ్‌ను శివమ్ దూబే వదిలేశాడు. అర్ష్‌దీప్ తొలి ఓవర్‌లో 3 పరుగులే ఇచ్చాడు.
హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. పాండ్యా వేసిన తొలి ఓవర్‌లో న్యూజీలాండ్ 21 పరుగులు చేసింది.
ఫొటో సోర్స్, Getty Images
భారత్ ఇన్నింగ్స్..
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 255 పరుగులు సాధించింది.
భారత బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ 89 పరుగులు, అభిషేక్ శర్మ 52 పరుగులు, ఇషాన్ కిషన్ 54 పరుగులు సాధించారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ శుభారంభాన్నిచ్చారు. ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
అభిషేక్ ఔటైన తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో భారత్ కేవలం 15 ఓవర్లలోనే 200 పరుగులు దాటింది.
ఆ తర్వాత, వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోవడంతో భారత రన్‌రేట్ తగ్గింది. అయితే, చివరి ఓవర్‌లో శివమ్ దూబే హిట్టింగ్ చేయడంతో భారత్ 20 ఓవర్లలో 255 పరుగులు సాధించింది.
న్యూజీలాండ్ జట్టులో నీషమ్ 3 వికెట్లు తీశాడు.
ఫొటో సోర్స్, Getty Images
ప్రారంభం నుంచి దూకుడుగా..
ఆరంభం నుంచి భారత్ దూకుడుగా ఆడింది.
ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ అందుకున్నాడు. సంజూ శాంసన్‌తో కలిసి సిక్సులు, ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
అభిషేక్ శర్మ 19 బంతుల్లోనే అర్థ సెంచరీ చేశాడు.
పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది.
51 పరుగులు చేసిన అభిషేక్, ఇన్నింగ్స్ 8వ ఓవర్లో, రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
10 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ వికెట్ నష్టపోయి 127 పరుగులు చేసింది.
ఫొటో సోర్స్, Getty Images
ఆ తర్వాత, ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
89 పరుగులు చేసిన శాంసన్ భారీ షాట్ ఆడబోయి నీషమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
దీంతో 15.1 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 2 వికెట్లు నష్టపోయి 203 పరుగులు చేసింది.
అనంతరం వెంటవెంటనే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్, సూర్య, హార్దిక్ పాండ్యా ఔటయ్యారు. దీంతో భారత రన్‌రేట్ తగ్గింది.
చివరి ఓవర్‌లో శివమ్ దూబే హిట్టింగ్ చేయడంతో భారత్ 20 ఓవర్లలో 255 పరుగులు చేసింది.
మ్యాచ్‌లో కొన్ని హైలైట్స్..
ఇండియా ఈ మ్యాచ్‌లో కొట్టిన సిక్సర్లతో కలిపి టోర్నీలో వంద సిక్సర్లు పూర్తి చేసింది.
అభిషేక్ శర్మ టోర్నీలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు.
ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. 18 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు.
తొలిసారి ఇండియన్ ఓపెనర్లు 50కి పైగా పరుగుల భాగస్వామ్యం అందించారు.
టాప్ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీ కొట్టారు.
ఫొటో సోర్స్, Getty Images
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 విజేత ఎవరో తేల్చే ‘ఫైనల్’ పోరు జరుగుతోంది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజీలాండ్ జట్లు తలపడుతున్నాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజీలాండ్ కెప్టెన్ శాంట్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది.
ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ భారత ఇన్నింగ్స్ ప్రారంభించారు.
సెమీస్‌లో ఆడిన జట్టుతోనే భారత్ ఫైనల్ ఆడుతోంది. అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి ఫామ్ కోల్పోయినా జట్టు వారిపై నమ్మకముంచింది.

తుది జట్లు ఇవే:
భారత్:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబె, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్
న్యూజీలాండ్:
మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), టిమ్ సెఫర్ట్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, జాకబ్ డఫీ, జిమ్మీ నీషమ్, మ్యాట్ హెన్రీ, లూకీ ఫెర్గూసన్
ఫొటో సోర్స్, Getty Images
గత ఎడిషన్‌లో (2024) ట్రోఫీని గెలుచుకున్న భారత్, ఇప్పుడు వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉంది.
ఈరోజు భారత్ గెలిస్తే, టీ20 ఫార్మాట్‌లో మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టుగా రికార్డుల్లోకి ఎక్కుతుంది.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఈ టోర్నీలో కీలక సమయంలో పుంజుకొని ఫైనల్‌కు దూసుకొచ్చింది. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై సాధించిన విజయం జట్టులో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది.
ఫొటో సోర్స్, Getty Images
కివీస్.. నిశ్శబ్దంగా ఫైనల్‌కు..
మరోవైపు, న్యూజీలాండ్ జట్టు తనదైన శైలిలో నిశ్శబ్దంగా ఫైనల్‌కు చేరుకుంది.
ఐసీసీ టోర్నీల్లో న్యూజీలాండ్ జట్టు సెమీఫైనల్స్, ఫైనల్స్ వరకు వచ్చి త్రుటిలో కప్పుకు దూరం కావడం చూశాం.
అయితే, ఈసారి తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడాలని శాంట్నర్ సేన భావిస్తోంది. సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన తీరు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
మ్యాచ్ ప్రారంభం: రాత్రి 7:00 గంటలకు.
ఈ మెగా ఫైనల్‌లో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుతుందా? లేక న్యూజీలాండ్ కొత్త చరిత్రను లిఖిస్తుందా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
(ఈ కథనం అప్డేట్ అవుతోంది.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



