వివాహం మరింత ప్రత్యేకంగా మారాలని ఈ జనరేషన్ పరితపిస్తుంది. వారి కోరికలకు, అభిరుచిలకు తగిన విధంగా వివాహా వస్త్రాలను మరింత ప్రత్యేకంగా డిజైన్ చేస్తూ వారి వివాహాంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది గౌరి సిగ్నేచర్స్. హైద్రాబాద్ లో గౌరీ సిగ్నేచర్స్ మరియు గౌరి సిగ్నేచర్స్ లో భాగమైన U&G పెళ్లి వస్త్రాలను డిజైన్ చేయటం లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. త్వరలో పెళ్ళి కానున్న బ్యాడ్మెంటన్ ప్లేయర్ శ్రీకాంత్ కిదాం బి, స్టైలిస్ట్ శ్రావ్యవర్మ సిగ్నేచర్ స్టూడియో లో తమ వెడ్డింగ్ డిజైన్స్ ను సెలెక్ట్ చేసుకున్నారు.
వివాహా వేడుకకు సంబంధించిన డిజైన్స్ ను ప్రత్యేకంగా అందిస్తుంది గౌరీ సిగ్నేచర్స్ మరియు U&G. అద్భుతమైన చీరలను గౌరి సిగ్నేచర్స్ అందిస్తే, కుటుంబంలో అందరికీ..హల్ది, మెహందీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్ ఇలా అన్ని వేడుకలకు వారి అభిరుచి కి తగిన విధంగా కస్టమైజేషన్ చేయటం లో U&G ముందుంది.
కాంజీవరం శారీస్ అంటేనే వివాహా వేడుకల్లో ప్రత్యేక స్థానంలో నిలుస్తాయి. కాంజీవరం శారీస్ ని అందించడంలో గౌరీసిగ్నేచర్స్ తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నాయి. దేశం లోని వివిధ ప్రాంతాలనుండి నేత పరిశ్రమలు గౌరీ సిగ్నేచర్స్ కి వెన్నెముక గా నిలుస్తున్నాయి.
ఈ సంధర్బంగా మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ సాయి మాట్లాడుతూ.. తమది స్వతహాగా వీవర్స్ కమ్యూనిటీ అని, వారి తండ్రి కౌతవరపు శ్రీనివాసరావుకి ఈ రంగం లో ఉన్న అనుభవమే ప్రీమియమ్ వెడ్డింగ్ కలెక్షన్స్ లో టాప్ గా నిలవటానికి కారణమన్నారు. శ్రీకాంత్ కిదాంబి , శ్రావ్య వర్మ లు మా స్టోర్స్ కి రావడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. సెలబ్రిటీస్ కి మాత్రమే కాకుండా, అందరికీ అందుబాటు బడ్జెట్ లలో డిజైనర్ దుస్తులు అందిస్తామన్నారు.