Home జాతీయ national telgu కాల్పుల విరమణ అంటే ఏమిటి? ఇది యుద్ధాలను ఆపగలదా?

కాల్పుల విరమణ అంటే ఏమిటి? ఇది యుద్ధాలను ఆపగలదా?

8
0

SOURCE :- BBC NEWS

1998లో ఉత్తర ఐర్లాండ్‌లో గుడ్ ఫ్రైడే ఒప్పందం కుదిరింది. ఐఆర్ఏ, లాయలిస్ట్ గ్రూపులు ఆయుధాలు పక్కన పెట్టేందుకు అంగీకరించాయి.

ఫొటో సోర్స్, Getty Images

2 గంటలు క్రితం

చదివే సమయం: 6 నిమిషాలు

ఇరాన్, అమెరికా దేశాలు.. రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ సమయంలో హార్ముజ్ జలసంధి మీదుగా రవాణా నౌకలు ప్రయాణించనున్నాయి.

ఇది అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన నెల రోజుల తర్వాత.. అలాగే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ‘ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం నశిస్తుంది’ అని హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత జరిగింది. హార్ముజ్ జలసంధి గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు, ఇతర ఎగుమతుల కోసం కీలకమైన నౌకా రవాణా మార్గం.

ఇరాన్‌తో దీర్ఘకాల శాంతి ఒప్పందం, మిడిల్‌ఈస్ట్‌లో శాంతి నెలకొనే రోజు దగ్గరలోనే ఉందని, అందుకే కాల్పుల విరమణకు అంగీకరించానని డోనల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు.

‘అమెరికా, ఇరాన్ మధ్య గత విభేదాలన్నీ దాదాపు పరిష్కారమయ్యాయి, ఈ రెండు వారాల సమయం తుది ఒప్పందాన్ని పూర్తి చేయడానికి సహాయపడుతుంది. ఈ దీర్ఘకాల సమస్య పరిష్కారానికి దగ్గరగా రావడం సంతోషంగా ఉంది” అని ఆయన చెప్పారు.

అమెరికా సంపూర్ణ విజయాన్ని సాధించిందనడంలో ఎలాంటి సందేహం లేదని ‘ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్‌’తో ట్రంప్ చెప్పారు.

అమెరికా పరాజయాన్ని ఎదుర్కొంటోందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పేర్కొంది. ఒప్పందానికి తుది రూపం ఇవ్వడానికి 15 రోజుల్లోగా పాకిస్తాన్‌లో చర్చలు జరుగుతాయి. దీంతో ఇరాన్ యుద్ధరంగంలో సాధించిన విజయాన్ని రాజకీయ చర్చల్లో కూడా బలపరుస్తామని అది తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
డోనల్డ్ ట్రంప్, షాబాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, Reuters

“రెండు పక్షాలు వివేకం చూపించాయని.. శాంతి, స్థిరత్వం కోసం నిర్మాణాత్మకంగా ముందుకు సాగాయని” అని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహ్‌బాజ్ షరీఫ్ అన్నారు.

‘ఇస్లామాబాద్ చర్చలు’ స్థిరమైన శాంతిని సాధించడంలో విజయవంతం కావాలని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు.

మిడిల్‌ఈస్ట్‌లోని అన్ని పక్షాలు అంతర్జాతీయ చట్టాలను పాటించి, కాల్పుల విరమణ నిబంధనలను గౌరవించాలని, దీర్ఘకాలిక శాంతికి మార్గం సుగమం చేయాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కోరారు.

అయితే ఇతర సంఘర్షణల మాదిరిగానే, రెండు వారాల కాల్పుల విరమణ నుంచి దీర్ఘకాల శాంతి దిశగా పయనించడానికి ఇంకా నైపుణ్యమైన రాజనీతిని అవసరం అవుతుంది.

కాల్పుల విరమణ ఒప్పందం, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, డోనల్డ్ ట్రంప్, నెతన్యాహు, ఖమేనీ, హార్ముజ్, ఆయిల్, గ్యాస్, ఇంధనం, యుద్ధం

ఫొటో సోర్స్, Reuters

కాల్పుల విరమణ అంటే..

“కాల్పుల విరమణకు ప్రత్యేకంగా ఒకే నిర్వచనం లేదు. ఈ పదం ‘సీజ్ ఫైర్’ అనే సైనిక ఆదేశం నుంచి వచ్చింది. దీని అర్థం కాల్పులు ఆపడం. ఇది ‘ఓపెన ఫైర్’కి విరుద్ధం. ‘ఓపెన్ ఫైర్’ అంటే కాల్పులు ప్రారంభించమని అర్థం” అని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

కాల్పుల విరమణ అంటే యుద్ధంలో ఉన్న రెండు పక్షాలు చర్చల్లో అంగీకారం కుదిరి.. ఏం నిర్ణయిస్తే అది అమలు చేయడం.

కాల్పుల విరమణ అనే పదాన్ని ‘ట్రూస్’,’ఆర్మిస్టిస్’ అనే పదాలతో కూడా దాదాపుగా ఒకే అర్థంలో వాడుతారు.

శత్రుత్వానికి తాత్కాలికంగా ముగింపు పలకడం అంటే సాధారణంగా యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపడం.

కాల్పుల విరమణ అనేది అధికారిక ఒప్పందం. ఇందులో సాధారణంగా ఈ అంశాలుంటాయి:

  • కాల్పుల విరమణ ఎందుకు జరుగుతోంది
  • దాని తర్వాత తీసుకునే రాజకీయ చర్యలు
  • ఎప్పుడు మొదలవుతుంది, ఎన్నాళ్లు ఉంటుంది
  • ఎక్కడ వర్తిస్తుంది

అదనంగా ఏ సైనిక చర్యలు అనుమతిస్తారు, ఏవి అనుమతించరు. అలాగే కాల్పుల విరమణను ఎలా పర్యవేక్షిస్తారు అనే వివరాలు కూడా ఉంటాయి.

1993లో కుదిరిన ఓ కాల్పుల విరమణ ఒప్పందం లైబీరియా ప్రభుత్వం, అక్కడి నేషనల్ పేట్రియాటిక్ ఫ్రంట్ రెబల్ ఫైటర్స్ మధ్య యుద్ధానికి ముగింపు పలికింది.

ఫొటో సోర్స్, Getty Images

లైబీరియాలో సివిల్ వార్ 1993లో ముగిసింది. ఆ సమయంలో నేషనల్ యూనిటీ తాత్కాలిక ప్రభుత్వం, నేషనల్ పేట్రియాటిక్ ఫ్రంట్ ఆఫ్ లైబీరియా, యునైటెడ్ లిబరేషన్ మూవ్‌మెంట్ ఆఫ్ లైబీరియా ఫర్ డెమోక్రసీతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది.

ఆయుధాలు దిగుమతి చేయకూడదు, సైనిక స్థావరాలను మార్చకూడదు, దాడి చేయకూడదు.. కొత్త శత్రుత్వాన్ని ప్రేరేపించకూడదు.. ల్యాండ్ మైన్లు, మంటపెట్టడానికి ఉపయోగించే ఆయుధాలు వాడకూడదు వంటి షరతులకు రెండు పక్షాలు అంగీకరించాయి.

కాల్పుల విరమణ తాత్కాలికమా, శాశ్వతమా…

కాల్పుల విరమణ శాశ్వతంగానూ, తాత్కాలికంగానూ ఉండవచ్చు అని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

కొన్నిసార్లు యుద్ధంలో ఉన్న రెండు పక్షాలు తాత్కాలికంగా లేదా ప్రాథమికంగా కాల్పుల విరమణకు అంగీకరిస్తాయి.

ఇది హింసను తగ్గించడానికి లేదా మానవతా సంక్షోభాన్ని తగ్గించడానికి కావచ్చు.

ఇజ్రాయెల్, హమాస్ నేతృత్వంలోని మిలిటెంట్ గ్రూపులు.. 2023 నవంబర్ 24 నుంచి నవంబర్ 30 వరకు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఆ సమయంలో హమాస్ 105 మంది బందీలను విడుదల చేసింది, దానికి ప్రతిగా సుమారు 240 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది.

చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి, అలాగే శాశ్వత, తుది కాల్పుల విరమణకు దారి చూపే మార్గాన్ని ఏర్పరచడానికి కూడా ప్రాథమిక కాల్పుల విరమణకు అంగీకరించవచ్చు.

కాల్పుల విరమణ ఒప్పందం, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, డోనల్డ్ ట్రంప్, నెతన్యాహు, ఖమేనీ, హార్ముజ్, ఆయిల్, గ్యాస్, ఇంధనం, యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

2000 సంవత్సరం జూన్‌లో ఎథియోపియా, ఎరిట్రియా యుద్ధాన్ని నిలిపివేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశాయి.

తద్వారా తుది కాల్పుల విరమణపై చర్చలు జరిగాయి.

డిసెంబర్‌లో అల్జీర్స్ ఒప్పందంలో భాగంగా దానిపై సంతకం చేశారు. ఇది అక్కడి యుద్ధాన్ని ముగించింది.

అయితే వరుసగా విఫలమయ్యే లేదా బలహీనమైన ప్రాథమిక కాల్పుల విరమణల కారణంగా యుద్ధం కొనసాగవచ్చు.

ఐక్యరాజ్యసమితి లెబనాన్‌లో సివిల్ వార్ ముగించడానికి 1978, 1981, 1982లో వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాల గురించి చర్చించింది. కానీ ప్రతి ఒప్పందం తర్వాత మళ్లీ యుద్ధం కొనసాగింది. 1975లో ప్రారంభమైన ఈ యుద్ధం చివరికి 1990లో ముగిసింది.

కొన్ని సందర్భాల్లో యుద్ధంలో ఉన్న ఒక పక్షం లేదా రెండు పక్షాలు తమ స్ధితిని బలపరచుకోవడానికి ప్రాథమిక కాల్పుల విరమణను ఉపయోగించడానికి ప్రయత్నించవచ్చు.

సాధారణంగా యుద్ధంలో ఉన్న రెండు పక్షాల మధ్య విజయవంతమైన శాంతి చర్చల తర్వాత శాశ్వత కాల్పుల విరమణ జరుగుతుంది.

ఇది సాధారణంగా ఆయుధాలను తొలగించడం లేదా సాయుధ బలగాలను నిలిపివేయడం అనే షరతులతో ఉంటుంది. కానీ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా భద్రతా ఏర్పాట్లు కొన్నేళ్లపాటు కొనసాగవచ్చు.

కాల్పుల విరమణ ఒప్పందం, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, డోనల్డ్ ట్రంప్, నెతన్యాహు, ఖమేనీ, హార్ముజ్, ఆయిల్, గ్యాస్, ఇంధనం, యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఉదాహరణకు 1998లో ఉత్తర ఐర్లాండ్‌లో గుడ్ ఫ్రైడే ఒప్పందం కుదిరింది. ఐఆర్ఏ, లాయలిస్ట్ గ్రూపులు ఆయుధాలు పక్కన పెట్టేందుకు అంగీకరించాయి.

శాంతి, సామరస్యాన్ని కొనసాగించడానికి వీలుగా కొన్ని నిబంధనలు కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయి.

ఉత్తర ఐర్లాండ్‌లో రిపబ్లిక్ ఆఫ్ ఐర్లండ్ మధ్య సరిహద్దులను ఎలాంటి అడ్డంకులు లేకుండా తెరిచి ఉంచడం, స్వేచ్ఛా వాణిజ్యం వంటివి ఈ ఒప్పందంలో భాగం.

పరిమిత కాల్పుల విరమణ అంటే?

2023 నవంబరులో తమ తాత్కాలిక కాల్పుల విరమణను ఇజ్రాయెల్, హమాస్ ”మానవతా విరామం” అని పిలిచాయి.

పోరాటంలో హింస తగ్గించడానికి లేదా ప్రజల సమస్యలు తగ్గించడానికి ఇలాంటి విరామాలు ఉపయోగపడతాయి.

ఉదాహరణకు సూడాన్ ప్రభుత్వం రెండు మిలిటెంట్ సంస్థలతో కాల్పుల విరమణకు అంగీకరించింది. సూడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్, జస్టిస్ అండ్ ఈక్వాలిటీ మూవ్‌మెంట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

దాంతో 45 రోజుల పాటు యుద్ధం ఆగింది. దీనివల్ల కొన్ని సంస్థలు స్థానికులకు మానవతాసాయం అందించేందుకు వీలు కలిగింది.

2004లో ఇండోనేసియాలో సునామీ సంభవించినప్పుడు ఇండోనేషియా ప్రభుత్వం, ఫ్రీ ఏక్ మూవ్‌మెంట్ కాల్పుల విరమణ ప్రకటించాయి. దీంతో వారు పోరాటం సాగించిన ప్రాంతాలకు మానవతాసాయం అందించడానికి అవకాశం ఏర్పడింది.

ఒక నిర్దిష్ట ప్రాంతంలో పోరాటాన్ని ఆపేందుకు చేసుకునే ఒప్పందాలను భౌగోళిక కాల్పుల విరమణగా పిలుస్తారు.

2018లో యెమెన్ ప్రభుత్వం, హూతీల మధ్య ఐక్యరాజ్యసమితి శాంతి ఒప్పందం కుదిర్చింది. స్థానిక ప్రజలకు రక్షణ కల్పించేందుకు హుదైదా రెడ్ సీ పోర్టు చుట్టూ ఘర్షణ నిలిపివేసేందుకు ఈ ఒప్పందం కుదిరింది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)