Home జాతీయ national telgu ఆస్ట్రేలియా: మద్యం సేవించి లైవ్ రిపోర్టింగ్ చేస్తూ తడబడిన రిపోర్టర్, స్పందించిన ఆ దేశ ప్రధాని

ఆస్ట్రేలియా: మద్యం సేవించి లైవ్ రిపోర్టింగ్ చేస్తూ తడబడిన రిపోర్టర్, స్పందించిన ఆ దేశ ప్రధాని

5
0

SOURCE :- BBC NEWS

డానికా మేసన్ ఆస్ట్రేలియా స్పోర్ట్స్ రిపోర్టర్, మద్యం

ఫొటో సోర్స్, Getty Images

ఇటలీ వింటర్ ఒలింపిక్స్‌లో లైవ్ రిపోర్టింగ్ చేస్తూ తడబడి మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో, ఆస్ట్రేలియన్ స్పోర్ట్స్ రిపోర్టర్ క్షమాపణ చెప్పారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కూడా స్పందించారు.

చానెల్ 9 రిపోర్టర్ డానికా మేసన్ మాట్లాడుతూ, ప్రత్యక్ష ప్రసారంలో కనిపించే ముందు మద్యం సేవించడం గురించి తాను తప్పుడు అంచనాతో ఉన్నానని అంగీకరించారు.

అయితే, బాగా ఆకలిగా ఉండటం, ఎత్తైన ప్రదేశం కావడం, చలిగా ఉండటం కూడా తాను మద్యం సేవించడానికి కారణమని ఆమె అన్నారు.

“నేను పూర్తి బాధ్యత తీసుకోవాలనుకుంటున్నా, నేను ఇలా చేయాల్సింది కాదు” అని ఆమె మరుసటి రోజు అన్నారు. “నాకు సిగ్గుగా అనిపించింది” అని కూడా అన్నారు.

దీనిపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ స్పందించారు. ఇందులో పెద్దగా తప్పుబట్టడానికి ఏమీలేదని, ఆమె జెట్‌లాగ్ ప్రభావానికి గురై ఉండొచ్చని ఆయన అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఆ రోజు క్రీడా కార్యక్రమాల గురించి రిపోర్టింగ్ చేస్తూ ఇగ్వానా( తొండలను పోలిన జీవులు)ల గురించి, కాఫీ ధర గురించి మాట్లాడారు మేసన్.

“ఇక్కడ కాఫీ ధర బాగానే ఉంది, కానీ అమెరికాలో కాఫీ ధరకు అలవాటు పడాల్సి ఉంటుంది. ఇగ్వానాల గురించి నాకు తెలియదు, ఈ విషయం ఎక్కడికెళుతోంది?’ అని ఆమె బుధవారం టుడే బ్రేక్‌ఫాస్ట్ టెలివిజన్ షోలో హోస్టుల వ్యాఖ్యలకు స్పందిస్తూ మాట్లాడారు.

ఆమె మూతపడుతున్నట్లున్న కళ్లతో చూస్తూ, మిగతా స్పోర్ట్స్ రిపోర్ట్‌లో కూడా తడబడి, మాటలు రోల్ చేసి, యూకే, యూఎస్‌ అంటూ గందరగోళంగా పలికారు. ఆ సమయంలో స్టూడియో హోస్ట్ కార్ల్ స్టెఫనోవిక్ వెనక నవ్వడం వినిపించింది.

‘చలి వాతావరణం నిజంగా పెద్ద సమస్య, పెదవులు కదపడం కూడా కష్టంగా ఉంటుంది, అవునా’ అని స్టీవనోవిక్ అన్నారు.

వైరలైన ఆమె రిపోర్టింగ్ క్లిప్‌లపై ఆస్ట్రేలియన్ల నుంచి మిశ్రమ సందన వచ్చింది.

“ఆమె బాగానే ఉంది. అందులో తప్పేమీ లేదు. ఆమె అక్కడ చాలా ఆనందంగా ఉంది” అని ఒకరు ఎక్స్‌లో అన్నారు.

“ఇది ఆరోగ్య సమస్య కాకపోతే, ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలి. ఇది వృత్తిపరమైన ప్రవర్తన కాదు” అని మరొకరన్నారు.

నేషనల్ రగ్బీ లీగ్ కవరేజ్‌కు ప్రసిద్ధి చెందిన ప్రముఖ స్పోర్ట్స్ రిపోర్టర్ మేసన్, గురువారం ఉదయం టుడే షోలో మళ్ళీ కనిపించారు.

లైవ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, వీక్షకులను ఉద్దేశించి క్షమాపణ చెప్పడానికి ఒక క్షణం తీసుకోవాలనుకుంటున్నాను, సరేనా అని అన్నారు.

ఆందోళనతో తనకు సందేశాలు పంపిన వీక్షకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

“నేను బాగానే ఉన్నా, కానీ కొంచెం సిగ్గనిపించింది” అని ఆమె అన్నారు.

‘‘నేను పరిస్థితిని సరిగ్గా అంచనా వేయలేదు. బాగా చలిగా ఉంది, ఎత్తైన ప్రదేశం, రాత్రి భోజనం కూడా చేయలేదు. ఈ పరిస్థితుల్లో మద్యం తాగి ఉండకూడదు. కానీ నేను పూర్తి బాధ్యత నాదే. నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు’ అని డానికా అన్నారు.

‘నేను నిజంగా క్షమాపణ చెబుతున్నా. నాకు సందేశాలు పంపినందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నా’ అని ఆమె చెప్పారు.

ది టుడే షో హోస్ట్ జేన్ అజ్జోపార్డి “నువ్వు ఎంత కష్టపడి పనిచేస్తావో మాకు తెలుసు డానికా” అనగా, స్టెఫనోవిక్ ఆమెను ‘లెజెండ్’ అని అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)