Home LATEST NEWS telugu తాజా వార్తలు ఆస్ట్రేలియాలో లేబర్ పార్టీ ఘన విజయం, మరోసారి ప్రధానిగా ఆల్బనీస్

ఆస్ట్రేలియాలో లేబర్ పార్టీ ఘన విజయం, మరోసారి ప్రధానిగా ఆల్బనీస్

1
0

SOURCE :- BBC NEWS

ఆస్ట్రేలియా

4 మే 2025, 07:12 IST

ఆస్ట్రేలియా ప్రధానిగా ఆంథోనీ అల్బనీస్ తిరిగి ఎన్నికయ్యారు.

ఆయన నేతృత్వంలోని సెంట్రల్-లెఫ్ట్ లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది.

లిబరల్-నేషనల్ సంకీర్ణ నాయకుడు పీటర్ డట్టన్ తన నియోజకవర్గం డిక్సన్‌లోనూ ఓటమి పాలయ్యారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఫొటో సోర్స్, Getty Images

ఆంథోనీ ఆల్బనీస్

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియన్ల నమ్మకాన్ని వమ్మ చేయమని ఆల్బనీస్ చెప్పారు. ఆస్ట్రేలియా ప్రజలు ఆస్ట్రేలియా విలువలకు ఓటేశారన్నారు. అనిశ్చితి నెలకొన్న ప్రపంచంలో ఆస్ట్రేలియన్లు ఆశావహ దృక్పథాన్ని, దృఢ సంకల్పాన్ని ఎంచుకున్నారన్నారు.

 పీటర్ డట్టన్

ఫొటో సోర్స్, Getty Images

‘తాము తగినంత బాగా పనిచేయలేదని’ డట్టన్ పేర్కొన్నారు. తనపై గెలిచిన అలి ఫ్రాన్స్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఆమె స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చక్కగా పనిచేయాలని కోరారు.

ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం కారణంగా అనిశ్చితి ఏర్పడిన వేళ, తాము చక్కని పాలన అందించగలమని అల్బనీస్ ఓటర్లను మెప్పించగలిగారని బీబీసీ ఆస్ట్రేలియా కరస్పాండెంట్ రాశారు.

పీటర్ డట్టన్ ఓటమి

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియా ప్రతినిధుల సభలో 85 స్థానాలను కైవసం చేసుకున్న లేబర్ పార్టీ తన మెజారిటీని ఇంకా పెంచుకునే దిశగా సాగిపోతోంది.

ప్రభుత్వ ఏర్పాటుకు 76 స్థానాలు సరిపోతాయి.

ఇప్పటిదాకా 63 శాతం ఓట్లు లెక్కించారు.

సంకీర్ణానికి 41 సీట్లు వచ్చాయి.

జీవన వ్యయం, ప్రజారోగ్యం, గృహసమస్య, అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ గురించిన ఆందోళన ఎన్నికలలో ప్రధాన ప్రచారాంశాలుగా మారాయి.

ఆస్ట్రేలియాలో 20 ఏళ్లలో ఒక ప్రధాని వరుసగా రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించడం ఇదే తొలిసారి.

ఆల్బనీస్

ఫొటో సోర్స్, Getty Images

‘శ్రామికవర్గ హీరో’

ఆస్ట్రేలియాకు రెండోసారి ప్రధానిగా ఎన్నికైన ఆల్బనీస్ వయసు 61 ఏళ్లు. వికలాంగ పెన్షన్ మీద ఆధారపడిన తల్లి వద్దే ఆయన పెరిగారు.

తాను పుట్టకముందే తన తండ్రి చనిపోయారని ఆల్బనీస్ నమ్ముతుండేవారు. ఓ వివాహితుడి కారణంగా తన తల్లి గర్భవతి అయిందని, ఆయన ఇంకా జీవించే ఉన్నారనే విషయాన్ని ఆల్బనీస్ తన టీనేజీలో తెలుసుకున్నారు.

మూడు దశాబ్దాల తరువాత తన తండ్రి కార్లో ఆల్బనీస్ చిరునామా తెలుసుకుని, ఆయనను కలవడానికి ఇటలీ వెళ్లారు.

ఆయన నిరాడంబరమైన పెంపకమే తన రాజకీయ ప్రస్థానానికి ప్రేరణగా నిలిచిందని ఆల్బనీస్ చెప్పారు.

ఆల్బనీస్ తన 33 ఏళ్ల వయసులో 1996లో మొదటిసారి ఇన్నర్ -సిటీ సిడ్నీ స్థానం నుంచి గెలుపొందారు.

సుదీర్ఘకాలంపాటు ఆస్ట్రేలియా ఎంపీగా సేవలందిస్తున్న వారిలో ఒకరైన ఆల్బనీస్‌ను కొంతమంది ‘శ్రామికవర్గ హీరోగా’ చూస్తుంటారు.

ఆస్ట్రేలియా ప్రజారోగ్య వ్యవస్థ సంరక్షకుడిగా ఆయనను చూస్తారు.

అలాగే ఎల్‌జీబీటీ కమ్యూనిటీ న్యాయవాదిగా, రగ్బీ లీగ్ అభిమానిగా ఆల్బనీస్ ప్రసిద్ధి పొందారు.

2007లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అల్బనీస్ ఒక సీనియర్ మంత్రి అయ్యారు.

తన కుమారుడు నాథన్ కోసం మెరుగైన ప్రపంచాన్ని సృష్టించాలనే తపనే తనను నడిపిస్తోందని ఆయన అన్నారు.

19 ఏళ్ల తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతూ ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చారు.

త్వరలోనే ఆయన జోడీ హెడెన్ను అనే మహిళను పెళ్లి చేసుకునే యోచనలో ఉన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS