Home జాతీయ national telgu ఆంధ్రప్రదేశ్: సామర్లకోట పేలుడు ఘటనలో 20 మంది మృతి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం...

ఆంధ్రప్రదేశ్: సామర్లకోట పేలుడు ఘటనలో 20 మంది మృతి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం చంద్రబాబు

13
0

SOURCE :- BBC NEWS

సామర్లకోట ప్రమాదం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Telugu Desam Party/Facebook

కాకినాడ జిల్లాలో జరిగిన భారీ పేలుడు ఘటనలో 20 మంది మృతి చెందారు.

సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 20 మంది మృతి చెందారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

కాకినాడ జీజీహెచ్‌లో క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

”పేలుడు ఘటనలో 20 మంది చనిపోయారు. మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం నుంచి ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మొత్తం 31 మంది.”

రోజువారీ కూలీపని కోసం వచ్చి ప్రమాదం బారినపడ్డారని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు 20 లక్షలరూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని, బాధిత కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని చంద్రబాబు అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
బాణసంచా తయారీ, అగ్నిప్రమాదం

ఫొటో సోర్స్, UGC

సీరియస్‌గా తీసుకుంటాం : సీఎం

“ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుంది. దీనిపై విచారణ కమిటీ వేసి, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటాం” అని చంద్రబాబు చెప్పారు.

“బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం. పేలుడు పదార్ధాల దగ్గర జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటాం. బాధ్యులైన వ్యక్తుల ఆస్తులు కూడా జప్తు చేస్తాం. అనుమతి లేకుండా బాణసంచా తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని చంద్రబాబు తెలిపారు.

సంబంధిత ఆర్డీవో, డీఎస్పీ, జిల్లా లేబర్ అధికారి, ఫైర్ ఆఫీసర్ నలుగురినీ సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.

బాణసంచా తయారీ, అగ్నిప్రమాదం

ఫొటో సోర్స్, UGC

అసలేం జరిగింది?

కాకినాడ జిల్లా, సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం పేలుడు జరిగింది.

పేలుడు శబ్దం నాలుగు కిలోమేటర్ల మేర వినిపించినట్లు స్థానికులు తెలిపారు.

గోదావరి కెనాల్ పక్కనున్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు స్థానికులు మీడియాతో చెప్పారు.

ఒక్కసారిగా పేలుడు జరగడంతో భారీయెత్తున మంటలు ఎగసిపడ్డాయని, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించినట్లు తెలిపారు.

పేలుడు శబ్దం తీవ్రతకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

బాణసంచా తయారీ, అగ్నిప్రమాదం

ఫొటో సోర్స్, UGC

ప్రధాని మోదీ సంతాపం

వేట్లపాలెం ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

“ఆంధ్రప్రదేశ్‌, కాకినాడ జిల్లాలోని కర్మాగారంలో ప్రమాదవశాత్తూ జరిగిన పేలుడులో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా” అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

“ఆంధ్రప్రదేశ్‌లోని బాణసంచా కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందుతోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1

X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

బాధితులకు అండగా ఉంటాం: సీఎం, డిప్యూటీ సీఎం

కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటన తీవ్ర దిగ్భాంతిని కలిగించిందని సీఎం చంద్రబాబు అన్నారు.

ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని, ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడానని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చంద్రబాబు తెలిపారు.

ప్రమాద స్థలాన్ని సందర్శించాలని మంత్రులు, సీనియర్ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి కారణాలేంటి? ఘటనాస్థలిలో కొనసాగుతున్న రక్షణ, సహాయక చర్యల పరిస్థితేంటనే విషయాలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపినట్టు ఏపీ సీఎంవో తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2

X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ పేలుడులో పలువురు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.

సామర్లకోటలో భారీ పేలుడు ఘటన తీవ్రంగా కలచివేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం ప్రకటించి అండగా నిలవాలని డిమాండ్ చేశారు.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది.)

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3

X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)