Home జాతీయ national telgu మార్కాపురం: ప్రైవేట్ ట్రావెల్ బస్, టిప్పర్ ఢీకొని ‘క్షణాల్లో వ్యాపించిన మంటలు’.. 14 మంది మృతి

మార్కాపురం: ప్రైవేట్ ట్రావెల్ బస్, టిప్పర్ ఢీకొని ‘క్షణాల్లో వ్యాపించిన మంటలు’.. 14 మంది మృతి

9
0

SOURCE :- BBC NEWS

ప్రమాదం, మార్కాపురం, ప్రైవేట్ ట్రావెల్స్

ఫొటో సోర్స్, UGC

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

స్థానిక పలకల క్వారీల సమీపంలో గురువారం ఉదయం ప్రైవేట్ బస్, టిప్పర్ ఢీకొనడంతో రెండు వాహనాలూ మంటల్లో చిక్కుకున్నాయి.

బస్‌లో ప్రయాణిస్తున్న 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మార్కాపురం ఇంచార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ‘బీబీసీ’తో చెప్పారు.

మరికొందరు ప్రయాణికులు గాయపడినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్, టిప్పర్ పూర్తిగా కాలిపోయాయి.

వాహనాలు ఢీకొన్న క్షణాల్లోనే మంటలు వ్యాపించాయని ఇంచార్జ్ ఎస్పీ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ప్రమాదం, మార్కాపురం, ప్రైవేట్ ట్రావెల్స్

ఫొటో సోర్స్, UGC

‘మొత్తం 34 మంది ప్రయాణికులు.. 20 మంది చికిత్స పొందుతున్నారు’

బస్‌లో మొత్తం 34 మంది ప్రయాణం చేస్తున్నారని 14 మంది చనిపోగా 20 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించామని వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఇంచార్జ్ ఎస్పీ తెలిపారు

ప్రమాదానికి గురైన బస్ తెలంగాణలోని జగిత్యాల నుంచి కలిగిరికి వస్తోందని చెప్పిన ఆయన మృతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రయాణికులు ఉండొచ్చని భావిస్తున్నామని ఆయన అన్నారు.

ప్రమాదం, మార్కాపురం, ప్రైవేట్ ట్రావెల్స్

ఫొటో సోర్స్, UGC

‘గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు’

ఇప్పటివరకు 13 మృతదేహాలను బస్సు నుంచి వెలికి తీశామని మార్కాపురం ఆర్డీవో ప్రభాకర్ బీబీసీతో చెప్పారు.

మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయని, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని ఆయన చెప్పారు.

ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చినట్లు తెలిపారు.

ప్రమాదం, మార్కాపురం, ప్రైవేట్ ట్రావెల్స్

ఫొటో సోర్స్, UGC

విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు

మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

టిప్పర్-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు ‘సజీవ దహనం’ కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ప్రమాదంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకున్నారు.

ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)