Home జాతీయ national telgu ‘నేను అదృష్టవంతురాలిని కాదు. ఒక టీనేజర్‌గా, మహిళగా, తల్లిగా చాలా బాధపడ్డాను’

‘నేను అదృష్టవంతురాలిని కాదు. ఒక టీనేజర్‌గా, మహిళగా, తల్లిగా చాలా బాధపడ్డాను’

17
0

SOURCE :- BBC NEWS

మహిళలు, పెద్ద వక్షోజాలు, ఆరోగ్య సమస్యలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రెబెక్కా త్రోన్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
  • 14 ఫిబ్రవరి 2026, 11:48 IST

  • చదివే సమయం: 6 నిమిషాలు

‘‘నా వక్షోజాలు పెద్దవిగా ఉన్నట్టు కనిపించకుండా ఉండేందుకు నేనెప్పుడూ నా భుజాలు వంచి నడిచేదానిని. ఇది నాకెంత ఇబ్బందిగా అనిపించేదో నాకిప్పటికీ గుర్తుంది’’

అర్జెంటీనాకు చెందిన యూనివర్సిటీ ప్రొఫెసర్ రాక్వెల్ 2010లో స్తనాల సైజు తగ్గించు కోవడానికి బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆపరేషన్ ఫలితంతో గతంలో ఎన్నడూ లేనంత ‘‘స్వేచ్ఛానుభూతి’’ కలిగిందని 52 ఏళ్ల రాక్వెల్ చెప్పారు.

ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో, పెద్ద వక్షోజాలను ఆకర్షణీయంగా పరిగణిస్తున్నారు. కానీ అవి మహిళల ఆరోగ్యానికి, నాణ్యమైన జీవనానికి సవాళ్లుగా మారుతున్నాయి.

వక్షోజాలు పెద్దగా ఉండటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. నిరంతరం వెన్నునొప్పి, తలనొప్పి, తిమ్మిర్లు, నిద్ర, మానసిక ఆరోగ్యం వంటి అనేక సమస్యలకు కారణమవుతాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

‘‘ఇష్టమైన పనులకు దూరం’’

ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఈస్తటిక్ ప్లాస్టిక్ సర్జరీ తాజా డేటా ప్రకారం, 2024లో ప్రపంచవ్యాప్తంగా 652,676 బ్రెస్ట్ రిడక్షన్ ఆపరేషన్స్ జరిగాయి.

వీటిలో, అత్యధిక సంఖ్యలో బ్రెజిల్ (1,15,647)లో బ్రెస్ట్ రిడక్షన్ ఆపరేషన్స్ జరిగాయి. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా (67,478), ఫ్రాన్స్ (38,780), జర్మనీ (32,068), తుర్కియే (25,334), భారత్(22,400) ఉన్నాయి.

తన వక్షోజాలు పెద్దవిగా ఉన్న కారణంగా యుక్తవయస్సు నుంచి నిరంతరం వెన్నునొప్పితో బాధపడాల్సి వచ్చిందని రాక్వెల్ చెప్పారు.

“కానీ అర్జెంటీనాలో, పెద్ద వక్షోజాలను వరంలా భావిస్తారు. చాలా మంది, ముఖ్యంగా మహిళలు, నేను చాలా అదృష్టవంతురాలినని చెబుతారు” అని ఆమె అన్నారు.

“నేను అదృష్టవంతురాలిని కాదు. నాకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక టీనేజర్‌గా, మహిళగా, తల్లిగా కూడా బాధపడ్డాను” అని ఆమె చెప్పారు.

నిజానికి తన శరీరాన్ని దాచుకోవడానికి నడిచిన తీరు వల్లే ఇప్పటికీ వెన్నునొప్పితో బాధపడుతున్నానని ఆమె తెలిపారు.

చురుకైన వ్యక్తి కావడంతో, రాక్వెల్ యోగా, జిమ్‌ చేయడాన్ని ఇష్టపడతారామె. కానీ, పెద్ద వక్షోజాల భారం ఆమెను ఇష్టమైన పనులకు దూరం చేసింది.

పాలు, వెన్నునొప్పి, అర్జెంటీనా

ఫొటో సోర్స్, Raquel

బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ కోసం వచ్చే మహిళలు తరచుగా నడవడం, వ్యాయామం చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారని బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ ఈస్తటిక్ ప్లాస్టిక్ సర్జన్స్ అధ్యక్షురాలు డాక్టర్ నోరా నుజెంట్ చెప్పారు.

“ప్రాక్టికల్‌గా చూస్తే, పెద్ద వక్షోజాలు బరువుగా ఉంటాయి, కాబట్టి అవి శరీరాన్ని ముందుకు లాగుతాయి. ఇది వీపు, మెడపై నిరంతరం ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో వ్యాయామం చేయడం చాలా అసౌకర్యంగా మారుతుంది. సైజుకి సరిపోయే బ్రా కొనడం కూడా ఆర్థిక భారంగా మారుతుంది” అని నోరా అన్నారు.

తన వక్షోజాలు పెద్దవిగా ఉన్న కారణంగా, వాటికి సపోర్ట్ ఇచ్చేలా “రెండు లేదా మూడు” బ్రాలు ధరించాల్సి వచ్చేదని రాక్వెల్ చెప్పారు. సైజుకు సరిపడా బ్రాలు దొరకడం ఆర్థిక భారంగానూ మారింది.

“అర్జెంటీనాలో, పెద్ద వక్షోజాల కోసం బ్రాలు కొనడం ఖరీదుతో కూడుకున్న పని” అని ఆమె చెప్పారు.

‘స్వేచ్ఛ దొరికినట్టనిపించింది’

తన దగ్గరకు వచ్చే చాలా మంది మహిళలకు ఒక్కో వక్షోజం బరువును 500 నుంచి 800 గ్రాములవరకు తగ్గిస్తానని నుజెంట్ చెప్పారు.

” మొత్తం శరీర బరువు పరంగా చూస్తే ఇది పెద్ద మొత్తం అనిపించకపోవచ్చు, కానీ శరీరంలోని ఒక చిన్న భాగానికి ఇది చాలా పెద్ద మొత్తం” అని ఆమె వివరించారు.

రాక్వెల్‌కు, వైద్యులు ఆమె వక్షోజాల నుంచి మొత్తం 2.5 కిలోల బరువును తొలగించారు.

“సర్జరీ తర్వాత, నేల నుంచి ఏదైనా వస్తువును తీసుకోవాల్సి వచ్చినప్పుడు ‘వావ్, ఇది పూర్తిగా భిన్నమైన శరీరం’ అనుకున్నా. నాకు నిజంగా స్వేచ్ఛ దొరికినట్టనిపించింది” అని రాక్వెల్ చెప్పారు.

వైద్యులు, బ్రెస్ట్ రిడక్షన్, ఆపరేషన్

ఫొటో సోర్స్, Raquel

‘మంచి బ్రా అవసరం’

నిరంతరం కలుగుతున్న వక్షోజాల నొప్పి గురించి ప్రొఫెసర్ జోవన్నా వేక్‌ఫీల్డ్ స్కార్ వైద్యులను సంప్రదించగా, ఆమెకు సరిగ్గా సరిపోయే అయ్యే బ్రా అవసరమని సలహా ఇచ్చారు.

బయోమెకానిక్స్‌లో నిపుణురాలు కావడంతో, “మంచి బ్రా నిజంగా ఎలా ఉండాలి” అనే విషయంపై పరిశోధన చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు.

“బ్రాలు ఎందుకు అవసరం, బ్రాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, బ్రా ఎలా పనిచేయాలి అనే విషయాలు మనకు చాలా తక్కువ తెలుసని గ్రహించాను. బ్రాలను శరీరానికి ఉపయోగపడే, ఆరోగ్యానికి లాభదాయకమైన వస్తువుగా కాకుండా ఫ్యాషన్‌గా చూస్తారు. ఇది నిజంగా చాలా నిరాశ కలిగించింది” అని ఆమె చెప్పారు. ఇది ఆమెకు బ్రిటన్‌లోని పోర్ట్స్‌మౌత్ వర్సిటీలో రొమ్ము ఆరోగ్యంపై ఓ పరిశోధనా బృందాన్ని ప్రారంభించడానికి ప్రేరణగా నిలిచింది.

సరైన బ్రా ధరించకపోవడం వల్ల కలిగే నాలుగు ప్రధాన ప్రతికూల ప్రభావాలను ఆమె బృందం గుర్తించింది:

  • నొప్పి, చర్మం బిగుతుగా మారడం
  • కణజాల(టిష్యూ) హాని.
  • శ్వాస విధానాలు, హృదయ స్పందన రేటులో మార్పులు
  • శారీరక శ్రమలకు ఆటంకం

“మీ వక్షోజాలు బరువుగా ఉండి, అవి పైకి కిందకు కదులుతుంటే, అది మీ శ్వాస తీరును నిజంగా మారుస్తుంది. మీరు నేలపై ఉపయోగించే శక్తిని కూడా మారుస్తుంది, అంటే ఇది మీ మొత్తం శరీర పనీతీరును ప్రభావితం చేస్తుంది” అని ఆమె చెప్పారు.

వక్షోజాల నొప్పిని తగ్గించడంలో ముఖ్యమైన విషయం వక్షోజాలు ఎంత కదులు తున్నాయనేది కాదు, వాటి కదలికను ఎంత తగ్గించవచ్చన్నదే ముఖ్యమని ఈ బృందం గ్రహించింది.

ఈ బృందం ఇప్పుడు ఇంగ్లాండ్ మహిళల ఫుట్‌బాల్ జట్టు, లయనెస్ వంటి ఉన్నత క్రీడాకారిణులు, ప్రపంచంలోని అగ్రశ్రేణి గోల్ఫర్లతో కలిసి పనిచేసి వారికి ఉత్తమమైన బ్రాలను రూపొందించింది.

“మహిళా అథ్లెట్ల శ్రేయస్సును మెరుగుపరచడానికి ఎఫ్ఏ, వరల్డ్ రగ్బీ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడం మనం చూస్తున్నాం. ఈ మార్పు గత ఐదేళ్లుగా మాత్రమే నిజంగా కనిపిస్తోంది. ఇదంతా కొత్త విషయం, కానీ ఈ మార్పు ఇప్పుడు కనిపించడం చాలా బాగుంది” అని వేక్‌ఫీల్డ్-స్కర్ చెప్పారు.

పోర్ట్స్‌మౌత్ విశ్వవిద్యాలయం, ఇంగ్లాండ్ లయన్సెస్, అర్జెంటీనా

ఫొటో సోర్స్, UEFA/UEFA via Getty Images

‘రోగులు మంచి జీవితం గడపాలనుకుంటారు’

పెద్ద వక్షోజాల భారాన్ని సమాజం ఎలా చూస్తుందో, అర్థం చేసుకుంటుందో రాక్వెల్ ప్రత్యక్షంగా అనుభవించారు.

బ్రెస్ట్ రిడక్షన్ ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నందుకు తన చుట్టూ ఉన్న వారి నుంచి వివక్షను ఎదుర్కొన్నానని, తన నిర్ణయానికి వెనుక ఉన్న కారణంపైనా ఓ సాధారణ అపోహ కూడా ఉందని ఆమె చెప్పారు.

“చాలా మంది ఇది ఆరోగ్యం గురించి కాదు, అందం గురించి తీసుకున్న నిర్ణయం అనుకున్నారు. నేను సర్జరీ చేయించుకున్నప్పుడు, ఒక మహిళ నాతో, ‘ఇప్పుడు నువ్వు వెళ్లి నీ పొట్టను కూడా బిగుతుగా చేసుకో, లైపోసక్షన్ లాగా’ అంది” అని ఆమె చెప్పారు.

ఇలాంటి ప్రతికూల స్పందనలు ఉన్నప్పటికీ, తన నిర్ణయంపై తనకు ఎలాంటి చింత లేదని రకుల్ చెబుతున్నారు.

“నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నాకు మెనోపాజ్ వచ్చింది. పెద్ద వక్షోజాలతో ఎలా జీవించేదాన్నో,ఆ శరీరంతో నేను ఎలా నెట్టుకొచ్చేదాన్నో ఊహక్కూడా అందడంలేదు” అని ఆమె అన్నారు.

బ్రెస్ట్ రిడక్షన్ ఆపరేషన్ చేయించుకుంటున్న రోగుల సంఖ్య పెరగడం… ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధకు అద్దంపడుతోందని నుజెంట్ చెప్పారు.

“కచ్చితంగా, కేవలం మహిళలు మాత్రమే కాదు, ఇప్పుడు రోగులందరూ మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారు, ఇది పర్‌ఫెక్షన్‌ కోసం కాదు, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం అన్వేషణ” అని నుజెంట్ చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)