SOURCE :- BBC NEWS
తల్లికి దూరమై.. బొమ్మకు దగ్గరై..
ఒక గంట క్రితం
ఏడు నెలల మకాకు కోతి పిల్ల పేరు పంచ్. ఇది జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో ఉంటోంది.
తల్లితో పాటు మిగతా కోతులు ఈ కోతి పిల్లను దగ్గరకు రానివ్వ లేదు. దీంతో ఇది ఒరంగుటాన్ బొమ్మతో ఆడుకుంటోంది.
పంచ్ పరిస్థితి గమనించి జూ కీపర్లు ఆ బొమ్మను తోడుగా ఇచ్చారు.
అది ఈ బొమ్మతో ఆడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పంచ్‌ను చూసేందుకు సందర్శకులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు.
పంచ్‌ను ఇప్పుడిప్పుడే మిగతా కోతులు దగ్గరకు రానిస్తున్నాయి.
ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



