SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, ANI
గతవారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) హోమ్ మ్యాచ్ ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు సీఎస్‌కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోని రాబోతున్నాడనే వార్త సోషల్ మీడియా యూజర్లు, స్పోర్ట్స్ లవర్స్, ఎక్స్‌పర్ట్స్, కామెంటేటర్లను ఆశ్చర్యపరిచింది.
కెప్టెన్‌గా ధోని పునరాగమనం పేలవమైన ప్రదర్శనలో ఉన్న సీఎస్‌కేకు అవసరమని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఐపీఎల్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు సీఎస్‌కే చాలా క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటోంది.
ఐదుసార్లు చాంపియన్స్ అయిన సీఎస్‌కే అప్పటి వరకు జరిగిన ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిని ఓడిపోయింది.
ఏప్రిల్ 11న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని కెప్టెన్‌గా తన సత్తా చాటాలని మైదానంలోకి వచ్చాడు. కానీ, అక్కడ కూడా సీఎస్‌కేకు పరాభవం తప్పలేదు.

సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేతికి గాయం కావడంతో, ధోని కెప్టెన్‌గా వచ్చాడు.
ధోని కెప్టెన్ అయినప్పటికీ, అలవోకగా కేకేఆర్ టీమ్ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఐపీఎల్ గత 18 సీజన్లలో సీఎస్‌కే వరుసగా మూడు హోమ్ మ్యాచ్‌లను ఓడిపోవడం ఇదే తొలిసారి. కేకేఆర్‌పై ఓటమి పాలు కావడం, వరుసగా ఐదు మ్యాచ్‌లు కోల్పోవడం కూడా ఇదే తొలిసారి.
పాయింట్ల టేబుల్‌లో సీఎస్‌కే అట్టడుగున ఉంది. దీనిపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే, మీడియా అయినా, సోషల్ మీడియా అయినా…సీఎస్‌కేపై జరిగే చర్చల్లో చాలా వరకు ధోనీతో మొదలై, ధోనీతోనే ముగుస్తున్నాయి.
ధోని బ్రాండ్ గురించి, అంతకుముందు మ్యాచ్‌లలో ఆయన సాధించిన విజయాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
సీఎస్‌కే అంటే పడి చచ్చే అభిమానులు అయితే, గత పెర్ఫార్మెన్స్ రిపీట్ అవుతుందని అంటున్నారు.
ధోని సారథ్యంలో 2021, 2023లో సీఎస్‌కే రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్‌ను గెలుచుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
ధోని ప్రదర్శన ఎలా ఉంది?
2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఎంఎస్ ధోని పదవీ విరమణ తీసుకున్నారు. అప్పటి నుంచి కేవలం ఐపీఎల్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు.
కెప్టెన్‌గా రెండు టైటిల్స్‌ను గెలుచుకోవడమే కాకుండా… గత కొన్ని సీజన్లలో చూసుకుంటే ధోని స్ట్రయిక్ రేటు బాగానే కనిపిస్తోంది.
2021లో 106.54గా, 2022లో 123.4గా, 2023లో 182.45గా, 2024లో 220.5గా ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 146.4 స్ట్రైక్ రేట్ సంపాదించుకున్నారు.
అయితే, ఈ కాలంలో ధోనీలో వచ్చిన మార్పులను, గణాంకాలను గమనించడం చాలా ముఖ్యం.
ధోనికి ప్రస్తుతం 40 ఏళ్లు. ఈ సమయంలో బ్యాటింగ్ బాగా తగ్గిపోయింది.
ధోనికి తప్పా ఇంకా మిగతా ఎవరికీ బ్యాటింగ్ ఆర్డర్‌లో అతను ఎప్పుడు, ఏ స్థానంలో ఆడాలో నిర్ణయించడం సాధ్యం కాదు.
అతని స్ట్రయిక్ రేటు ఏదైనప్పటికీ, ఆడే బంతుల సంఖ్య సీజన్ సీజన్‌కు తగ్గుతూ వస్తోంది.
2020-21 నుంచి ప్రతి సీజన్‌లో ధోని 200 బంతుల కంటే తక్కువనే ఆడుతున్నారు.
గత రెండు సీజన్లలో ధోని 100 బంతుల కంటే తక్కువనే ఆడాడు. 2023లో 12 ఇన్నింగ్స్‌లో 57 బంతులు, 2024లో మొత్తం 11 ఇన్నింగ్స్‌లో 73 బంతులనే ఆడారు.
ఈ మూడు సీజన్లలో కూడా, 26 సార్లు ధోని నాట్ అవుట్. దీనిబట్టి, తాను బ్యాటింగ్ చేసే ఆర్డర్‌ను ఎంత తగ్గించుకున్నాడు, గేమ్‌లో ఎంత ఆలస్యంగా వస్తున్నాడో అర్థమవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుత సీజన్‌లో ధోని బ్యాటింగ్ ఎలా ఉంది?
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన ఆరు ఇన్నింగ్స్‌లో కేవలం 71 బంతులే ఆడాడు. ప్రతి మ్యాచ్‌లో సరాసరిన 12 బంతుల కంటే తక్కువగానే ఆడాడు.
ఇందులో 13 బంతులు బౌండరీ దాటగా, వాటిలో ఆరు ఫోర్లు, ఏడు సిక్స్‌లు ఉన్నాయి. మిగిలిన 58 బంతుల్లో ధోని చేసింది కేవలం 38 పరుగులే.
అతను ఆలస్యంగా బ్యాటింగ్‌కు రావడాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. రెండు సందర్భాల్లో అయితే, ధోని 9వ బ్యాటర్‌గా గేమ్‌లోకి వచ్చాడు. ఆ మ్యాచ్‌ను టీమ్ ఓడిపోయింది.
బ్యాటింగ్ విషయంలో సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా తికమక వివరణ ఇచ్చారు.
”అవును, ఇది టైమ్‌కు సంబంధించింది. పది ఓవర్ల పాటు అతను బ్యాటింగ్ చేయలేడు. అందుకే, మ్యాచ్ పరిస్థితిని బట్టి జట్టు కోసం ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాడు” అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సీఎస్‌కే జట్టులో ధోని ముద్ర
”11 మంది ఆటగాళ్ల జట్టులో ధోని లేకపోతే, ఫ్రాంచైజీ స్టేడియంలో టిక్కెట్లను అమ్మలేదు, సీట్లను నింపలేదు. సీఎస్‌కే బ్రాండ్‌కు ధోని అంత బలం” అని చెన్నై ప్రజలు అంటున్నారు.
చెన్నై లాంటి క్రికెట్‌ను అభిమానించే నగరంలో ఇది నమ్మడం కష్టమే. ఒకవేళ ఇదే నిజమైతే, 18 సీజన్లలో ఫ్రాంచైజీ ఖాళీగా కూర్చున్నట్లే.
కేవలం ఒక వ్యక్తిపై ఆధారపడి ఫ్రాంచైజీ ఫ్యాన్ బేస్ మనుగడ సాధించగలదా? అత్యంత చురుకైన ఫ్రాంచైజీ వారసత్వ ప్రణాళికను పక్కనపెడుతుందా? అనే సందేహాలు నెలకొంటున్నాయి.
గత కొన్నేళ్ల విషయం అంత స్పష్టంగా తెలియనప్పటికీ, 2025లో ధోనితో సీఎస్‌కే బాగా అసోసియేట్ అయిందని మాత్రం నిరూపితమైంది. ఈ పట్టు నుంచి వీరెవరూ తప్పించుకోలేకపోతున్నారని అర్థమవుతుంది.
ముందు ఐపీఎల్ సీజన్లలో ఉన్న ఆటగాళ్లకు సీఎస్‌కే పెద్ద ఎత్తున నిధులను కేటాయించి కొనుగోలు చేసింది. వీరు టీ20 ఫార్మాట్ క్రికెట్‌ను ఆడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ధోని ఫార్ములా పనిచేయడం లేదు
గత కొన్ని ఓవర్లలో గేమ్‌ను మలుపుతిప్పడం, సిక్స్‌లతో బౌండరీలను బాదే ధోని ఫార్ములా పనిచేయడం లేదు.
బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో ఏ దశలో కూడా సిక్స్‌లకు కొదవ లేదు. పవర్ ప్లే స్కోర్లు భారీగా పెరుగుతున్నాయి. స్ట్రయిక్ రేటు కూడా. యువ బ్యాటర్లు 180 పరుగులకు పైగా లక్ష్యంతో మైదానంలోకి వస్తున్నారు.
ధోనితో సహా సీఎస్‌కే నాయకత్వం దీన్ని గుర్తించడం లేదు. అలాంటి బ్యాటర్లపై సమయాన్ని వెచ్చించడం లేదు.
ఇతర ఏ ఐపీఎల్ టీమ్‌తో పోల్చినా, సీఎస్‌కే ఈ సీజన్‌లో చాలా వరకు డాట్ బాల్స్‌నే కొడుతుంది. అంటే అసలు పరుగులు చేయడం లేదు.
ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లలో 119.1 ఓవర్లను ఆడితే.. దానిలో 245 డాట్ బాల్స్‌ను కొట్టారు. అంటే ఎలాంటి పరుగులూ చేయని ఓవర్లు 40కి పైనే. అన్ని జట్లతో పోలిస్తే సీఎస్‌కేలో సిక్సులు చాలా తక్కువ.
ఈ సీజన్‌లో ధోని పెర్ఫార్మెన్స్ సీఎస్‌కే క్రికెట్‌ను ప్రతిబింబిస్తోంది. వికెట్‌కీపర్‌గా, బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ధోని తప్ప సీఎస్‌కేకు మరెవరూ ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. వికెట్‌కీపర్‌గా ధోని తన స్థానాన్ని పదిలం చేసుకోగలడు. నాయకత్వ లక్షణాలతో మ్యాచ్‌లో కొంత భాగాన్ని ఆయన నియంత్రించగలడు.
ధోని సారథ్యంలోని సీఎస్‌కే 2025 జట్టు ప్రతి విభాగంలో అలసిపోయినట్లు కనిపిస్తోంది. అదే అలసట ధోనీలోనూ ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)